పనిచేసే ప్రదేశం లో మహిళలపై లైంగిక వేధింపులనుఅరికట్టుటకు అంతర్గత ఫిర్యాదు కమిటీలను ఏర్పాటు చేయాలి
జిల్లా సంక్షేమ అధికారి స్వర్ణలత లెనినా
పయనించె సూర్యుడు జనవరి 31(పొనకంటి ఉపేందర్ రావు )
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అన్ని కార్యాలయాలు, సంస్థలు, ప్రభుత్వం మరియు ప్రైవేటు రంగాలకు చెందిన సంస్థలలో లైంగిక వేధింపుల నిరోధక చట్టం-2013ప్రకారంతప్పనిసరిగా అంతర్గత ఫిర్యాదు కమిటి ఏర్పాట్లు చేయవలసింధిగా జిల్లా సంక్షేమ శాఖ అధికారి స్వర్ణలత లెనినా సూచించారు. She box portal web site :http://shebox.wcd.gov.in ICC ఏర్పాటు చేయని లేదా ICC వివరాలు పోర్టల్ లో నమోదు చేయని సంస్థల పై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలిపారు. కావున అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, ప్రైవేటు సంస్థలు , వ్యాపార సంస్థలు , పరిశ్రమలు వెంటనే అంతర్గత ఫిర్యాదు కమిటినీ ఏర్పాట్లు చేసి పూర్తి వివరాలు షీ బాక్స్ పోర్టల్ లొ నమోదు చేయాలని కోరారు. అంతర్గత ఫిర్యాదు కమిటీ సభ్యుల వివరాలు జిల్లా సంక్షేమాధికారి కార్యాలయం లో అందించాలని తెలిపారు. ఈ విషయాన్ని గమనించి తక్షణమే అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను మరియు విద్యా సంస్థల యాజమాన్యాలకు తెలియజేశారు.కమిటీ సభ్యులు ఈ విధంగా ఉండేలాగా చూసుకోవాలని చెప్పారు 1 అధ్యక్షురాలు (Presiding Officer) – సీనియర్ మహిళా ఉద్యోగికనీసం 2 సభ్యులు – మహిళా హక్కులు / సామాజిక సేవలపై అవగాహన ఉన్న ఉద్యోగులు3. బాహ్య సభ్యుడు – ఎన్‌జీఓ / మహిళా సమస్యలపై అనుభవం ఉన్న వ్యక్తి
కమిటీలో కనీసం 50% మహిళలు ఉండాలి