PS Telugu News
Epaper

రోజు రోజుకు పతనమవుతూ భారీగా తగ్గుతున్న బంగారం.

📅 03 Feb 2026 ⏱️ 5:26 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

.పయనించే సూర్యుడు న్యూస్ ఫిబ్రవరి 3 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి

బంగారం ధర భారీగా తగ్గుతోంది. ముఖ్యంగా పసిడి ధరలు అంతర్జాతీయ మార్కెట్లలో విపరీతంగా తగ్గిపోతున్నాయి. తాజాగా ఫిబ్రవరి రెండో తేదీ సోమవారం చూసినట్లయితే బంగారం ధరలు ఇలా ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ఒక ఔన్స్ బంగారం ధర ప్రస్తుతం 4,751 డాలర్లు పలుకుతోంది. ఉదయం నుంచి గమనించినట్లయితే దాదాపు 139 డాలర్లు బంగారం ధర పతనం అయినట్లు చూడవచ్చు.ఇంకా దేశీయ మార్కెట్లలో గమనించినట్లయితే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ప్రస్తుతం 1,46,600 రూపాయలు పలుకుతోంది.ఉదయం నుంచి గమనించినట్లయితే దాదాపు 4,417 రూపాయలు బంగారం ధర తగ్గినట్లు గమనించవచ్చు.బంగారం ధరలు భారీగా తగ్గడానికి ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లలో చోటుచేసుకున్నటువంటి పరిణామాలు కారణంగా చెప్పవచ్చు.ముఖ్యంగా అమెరికా ఈక్విటీ మార్కెట్లలో లాభాలు చోటు చేసుకుంటున్నా నేపథ్యంలో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను బంగారం నుంచి తరలిస్తున్నారు.ఈ కారణంగానే బంగారం ధర తగ్గుతుంది అని చెప్పవచ్చు.

Scroll to Top