ఐదు కేజీల అక్రమ గ్యాస్ సిలిండర్లు కు గ్యాస్ నింపడం వలన ప్రమాదం పొంచి ఉంది
పయనించే సూర్యుడు ఫిబ్రవరి 4 (సూళ్లూరుపేట నియోజకవర్గ రిపోర్టర్ దాసు)
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలో అక్రమంగా గ్యాస్ ఫిల్లింగ్ చేస్తున్నారు సూళ్లూరుపేట బజార్లోని వినాయకుడి సమీపంలో చిన్న షాపుల్లో హైయర్స్ షాపుల్లో అక్రమంగా ఐదు కిలోల గ్యాస్ సిలిండర్ కి గ్యాస్ ఫిల్లింగ్ చేస్తున్నారు ఈ గ్యాస్ ఫిల్లింగ్ దగ్గర ఎటువంటి భద్రత ప్రమాణాలు లేవు ! జనాలు రద్దీ ఎక్కువగా ఉన్న దగ్గర ఇలాంటి అక్రమ గ్యాస్ ఫిల్లింగ్ చేయడం చాలా ప్రమాదకరం ఈ అక్రమ గ్యాస్ సిలిండర్ ఫీలింగ్ ఎందుకు పౌరసరఫరాల శాఖ అధికారులు గుర్తించలేదు తెలియదు? గత సంవత్సరం మహదేవయ్య నగర్ లో ఒక హిందీ వ్యాపారస్తుడి ఇంటిలో ఈ ఐదు కేజీలు గ్యాస్ సిలిండర్లు పేలుడు వలన ప్రమాదం జరిగిన సంగతి పౌరసరఫరాల శాఖ అధికారులు మర్చిపోయారా! ఫైర్ డిపార్ట్మెంట్ వారి సూళ్లూరుపేట లో ఉన్నారా లేరా ఇలాంటి ఇల్లీగల్ బిజినెస్లకు పర్మిషన్ ఉందా లేదా అని చెక్ చెయ్ రా ఎవరికి తోచిన బిజినెస్ వాళ్ళు చేసుకోవచ్చా ఇలాగైతే సూళ్లూరు పేటలో మనుషులు కాదు మొక్కలే ఉంటాయి ఇకనైనా అక్రమ ఐదు కేజీల గ్యాస్ సిలిండర్లు నింపి విక్రయించే వారి షాపులపై తనిఖీలు జరిపి వారిపై తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము, అక్రమ గ్యాస్ ఫిల్లింగ్ పై సూళ్లూరుపేట ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోకపోతే ఈ విషయంపై తిరుపతి జిల్లా కలెక్టర్ వారి దృష్టికి తీసుకెళ్తామని తెలియజేస్తున్నాం
