PS Telugu News
Epaper

ఆదరించి గెలిపించండి అభివృద్ధి చేసి చూపిస్తా15 వార్డు కాంగ్రెస్ అభ్యర్థి కోళ్ల సంధ్య వెంకటేష్

📅 04 Feb 2026 ⏱️ 7:26 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

{పయనించే సూర్యుడు} {ఫిబ్రవరి5 మక్తల్}

మక్తల్ , మునిసిపల్ ఎన్నికల్లో తనను ఆదరించి గెలిపించండి 15వ వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోళ్ళ సంధ్య వెంకటేష్ అన్నారు .ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం 15వ వార్డు పరిధిలోని కుమ్మరిగేరి, కట్టెల మిషన్ ఏరియా లో విస్తృతంగా మద్దతు దారులతో కలిసి ఇంటిటి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ తోనే మున్సిపాలిటీ అభివృద్ధి సాధ్యమని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి సహకారంతో 15వ వార్డు పరిధిలో పూర్తిస్థాయి అభివృద్ధి చేస్తానని అన్నారు. ఇప్పటికే డ్రైనేజీ సిసి రోడ్ల నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు.

Scroll to Top