PS Telugu News
Epaper

తరగతి గది నుంచి బయట ప్రపంచాన్ని చూడేలా విద్యార్థులను తీర్చిదిద్దాలి : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

📅 04 Feb 2026 ⏱️ 7:28 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించె సూర్యుడు ఫిబ్రవరి 4(పొనకంటి ఉపేందర్ రావు )

భద్రాద్రి కొత్తగూడెం :తరగతి గదిలో పాఠ్యాంశాలకే పరిమితం కాకుండా, బయట ప్రపంచంలో ఎదురయ్యే అనేక సమస్యలకు పరిష్కారాలు ఆలోచించే విధంగా విద్యార్థులను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. విద్యార్థులు నూతన ఆవిష్కరణలు చేయడం ద్వారా తమ ఆలోచనలను కార్యరూపంలోకితీసుకురావాలంటేఉపాధ్యాయుల ప్రోత్సాహం కీలకమని ఆయన తెలిపారు.భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పాల్వంచలోని అనుబోస్ ఇంజనీరింగ్ కళాశాలలో జిల్లాలోని పీఎం శ్రీ పాఠశాలల ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులకు మూడు రోజులపాటు నిర్వహించనున్న “ఇన్నోవేషన్, డిజైన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్” బూట్ క్యాంప్‌ను బుధవారం జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగాఆయనమాట్లాడుతూ విద్యార్థులు నిత్యజీవితంలో ఎదుర్కొనే సమస్యలను గుర్తించి, వాటికి పరిష్కారాలు చూపేలా ప్రాజెక్టులు రూపొందించేందుకు ఉపాధ్యాయులు మార్గనిర్దేశం చేయాలని సూచించారు. అలాంటి ప్రాజెక్టులను ఉత్పత్తుల రూపంలోకి తీసుకువచ్చే దిశగా విద్యార్థులను ప్రోత్సహించేలా ఈ బూట్ క్యాంప్ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.ఈ బూట్ క్యాంప్ ద్వారా ఉపాధ్యాయులు పొందిన జ్ఞానం, అనుభవాలను తరగతి గదిలో విద్యార్థులకు అందించి, వారి సృజనాత్మక ఆలోచనలు, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించాలని కలెక్టర్ సూచించారు. విద్యార్థులు రూపొందించిన నవకల్పనలను ఉత్పత్తులుగా అభివృద్ధి చేయడంలో వాద్వానీ ఫౌండేషన్, భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ, పీఎం శ్రీ పాఠశాలలు భాగస్వాములుగా వ్యవహరించి విద్యార్థులను ప్రోత్సహించాలని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో అఖిల భారత సాంకేతిక విద్యా మండలి నుండి విభం వ్యాస్, వాద్వానీ ఫౌండేషన్ నుండి శ్యామ్, డాక్టర్ హెచ్. శ్రీనివాస్ వరప్రసాద్, అనుబోస్ ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ భరత్ కృష్ణ, ప్రిన్సిపాల్ రవికుమార్, జిల్లా విద్యాశాఖ అకాడమిక్ మానిటరింగ్ అధికారి ఏ. నాగరాజశేఖర్‌తో పాటు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల నుండి పీఎం శ్రీ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Scroll to Top