PS Telugu News
Epaper

ఆశీర్వదించండి అభివృద్ధి చేసి చూపిస్తా5 వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి వెంకటేశ్వర్లు( పెయింటర్)

📅 05 Feb 2026 ⏱️ 12:41 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

{ పయనించే సూర్యుడు}{న్యూస్ జనవరి 6}మక్తల్

మక్తల్ , ఫిబ్రవరి 5 మునిసిపల్ ఎన్నికల్లో తనను ఆదరించి గెలిపించండి 5వ వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెంకటేశ్వర్లు( పెయింటర్) అన్నారు .ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం 5వ వార్డు పరిధిలోని నందిని నగర్. మైనార్టీ కాలనీ. ఎరుకలగేరి ,Bc కాలనీ ఏరియా లో విస్తృతంగా మద్దతు దారులతో కలిసి ఇంటిటి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా అభ్యర్థి వెంకటేశ్వర్లు. మాట్లాడుతూ కాంగ్రెస్ తోనే మున్సిపాలిటీ అభివృద్ధి సాధ్యమని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి సహకారంతో 5వ వార్డు పరిధిలో పూర్తిస్థాయి అభివృద్ధి చేస్తానని అన్నారు. ఇప్పటికే డ్రైనేజీ సిసి రోడ్ల నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు యువకులు మరియు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

Scroll to Top