PS Telugu News
Epaper

ప్రజా ప్రభుత్వానికి అండగా ఉండండి మున్సిపాలిటీ ఎన్నికల్లో చేతు గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించండి

📅 05 Feb 2026 ⏱️ 4:33 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ తాటికొండ గంగాధర్

బాల్కొండ నియోజకవర్గం లో -భీంగల్ పట్టణ ప్రజలకు బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ విజ్ఞప్తి. *భీంగల్ పట్టణ అభివృద్ధి కొరకు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలవాలని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ కోరారు.*ఈ ప్రజా ప్రభుత్వంలో అర్హులైన పట్టణ ప్రజలకు ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులను అందించాలని గత ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వక ప్రజలను మోసం చేసిందని ఆయన అన్నారు.ఒక్క భీంగల్ పట్టణానికే 200 లకు పైగా ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసామని ఇప్పుడు ఆ ఇండ్లన్నీ నిర్మాణ దశలో ఉన్నాయని తెలిపారు. భీంగల్ పట్టణంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లను కేటాయిస్తామని అన్నారు.భీంగల్ పట్టణ అభివృద్ధిని గత ప్రభుత్వం పక్కన పెట్టిందని కానీ ఈ ప్రజా ప్రభుత్వం ప్రతి వార్డులో మురికి కాలువలు సిసి రోడ్ల నిర్మాణం కొరకు మరియు త్రాగునీటి సదుపాయం కొరకు 54 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని పనులన్నీ నిర్మాణ దశలో ఉన్నాయని అన్నారు.*భీంగల్ పట్టణంలో గల కేజీబీవీ పాఠశాలను 40 లక్షల రూపాయలతో మరమ్మతులు చేయించి విద్యార్థులకు సౌకర్యాలు కల్పించడం జరిగిందని అన్నారు.భీంగల్ మున్సిపాలిటీ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడాలని అభివృద్ధి చేసే బాధ్యతను తాను తీసుకుంటానని తెలిపారు.
కార్యక్రమాలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Scroll to Top