PS Telugu News
Epaper

మక్తల్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మమేకమై ముందుకు సాగుతున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి. కొండయ్య అన్న, ప్రచారంలో భాగంగా మూడవ రోజు ఇంటింటి ప్రచారంలో

📅 06 Feb 2026 ⏱️ 1:26 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

:పయనించే సూర్యుడు: న్యూస్ జనవరి 6 మక్తల్:

బీజేపీ బలపరిచిన ఒకటో వార్డు అభ్యర్థి రాజశేఖర్ రెడ్డి కి మద్దతుగా కొండయ్య అన్న ఇంటింటి ప్రచారంలో పాల్గొని, బీజేపీ గుర్తుపై ఓటు వేసి రాజశేఖర్ రెడ్డి ని భారీ మెజార్టీతో గెలిపించాలని వార్డు ప్రజలను కోరారు.
ఈ సందర్భంగా ప్రజల నుండి మంచి స్పందన లభించింది. కొండయ్య కుటుంబానికి మరియు కాలనీ ప్రజల కుటుంబాలకు ఎన్నో సంవత్సరాలుగా సన్నిహిత అనుబంధం ఉందని ప్రజలు తెలిపారు. అలాంటి కుటుంబం నుండి ఒక బిడ్డగా *బీజేపీ కొండయ్య మా మధ్యకు రావడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు.మా బిడ్డ మాటగా భావించి ఆయన మాట నిలబెడతామని, తప్పకుండా బీజేపీ గుర్తుపై ఓటు వేసి రాజశేఖర్ రెడ్డి ని భారీ మెజార్టీతో గెలిపిస్తామని కాలనీ ప్రజలు నమ్మకం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు పాల్గొని ఇంటింటి ప్రచారాన్ని విజయవంతం చేశారు

Scroll to Top