PS Telugu News
Epaper

అడవి పంది దాడిలో వ్యక్తి మృతి

📅 06 Feb 2026 ⏱️ 1:29 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article


పయనించే సూర్యుడు గాంధారి 07/02/26

గాంధారి మండలం హేమ్లా నాయక్ తండాకు చెందిన గుగులోతు సుభాష్ అనే వ్యక్తి మొన్న సాయంత్రం వాళ్ల తాండాకు చెందిన ఒక వ్యక్తి యొక్క భార్య తప్పుకోవడంతో గౌరారం శివారులో గల అడవుల్లో వెతకడానికి వెళ్లగా అక్కడ అడవి పంది దాడి చేయగా మెడపైన తీవ్ర రక్త గాయం జరిగి చనిపోయినట్టుగా అతని భార్య మంజుల ఫిర్యాదు ఇవ్వనైనది.కానీ ఇట్టి మృతి పైన పోలీసులకి ఉన్న అనుమానంతో గౌరారం అడవులలో నేరo జరిగిన స్థలమును మరియు మృతుని యొక్క శవం పైన ఉన్న గాయాలు మరియు ఆనవాల్లను బట్టి అలాగే వైద్యుల యొక్క అభిప్రాయాన్ని బట్టి తెలిసినది ఏమనగా అడవి జంతువు బలంగా గుద్ది లాక్కొని పోయినట్టు తెలుస్తున్నది.వేటకి వెళ్ళినారా ఇంకేదైనా కారణమా లేదా ఆయుధాలు ఏమైనా ఉపయోగించారా అనే కోణం లో దర్యాప్తు జరుగుతున్నది. సదాశివనగర్ సీఐ సంతోష్ కుమార్ పరిశీలించటం జరిగింది

Scroll to Top