PS Telugu News
Epaper

ప్రమాదకరంగా మారిన అక్రమ ఐదు కేజీల గ్యాస్ సిలిండర్ ఫిల్లింగ్

📅 06 Feb 2026 ⏱️ 1:56 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు ఫిబ్రవరి 7 (సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ దాసు )

తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలో ఇండస్ట్రీ ఏరియాగా ఎంతో అభివృద్ధి చెందుతున్న ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న అక్రమంగా గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్లు పైన నామమాత్రపు దాడులతో సరిపెట్టుకుంటున్న ప్రభుత్వం అధికార యంత్రాంగం 5 కేజీల అక్రమ గ్యాస్ సిలిండర్లు కు ఫిల్లింగ్ జరుగుతుందో మహా ప్రభు అని వార్త ప్రచురించగా ఆ వార్తను చూసి నామమాత్రపు దాడులు నిర్వహించారు ఆ షాప్ ఉన్న దగ్గరకు వెళ్లి ఇక్కడ ఫిల్లింగ్ చేయకూడదని చెప్పి వచ్చినా ఫైర్ స్టేషన్ ఇన్స్పెక్టర్ అంతేకానీ వారి వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఆ ఫైర్ ఆఫీస్ ఇన్స్పెక్టర్ని వివరణ కోరగా ఇంకెక్కడైనా ఉంటే చెప్పండి అని సమాధానం ఇచ్చారు దానిమీద యాక్షన్ తీసుకునే రైట్స్ నాకు లేదు ఫైర్ సేఫ్టీ సిఐ చెప్పాలి అని సమాధానం ఇచ్చారు సూళ్లూరుపేట ప్రజల ప్రాణాలకు విలువ లేదా గ్యాస్ ఫిల్లింగ్ చేసేటప్పుడు ఏదైనా ప్రాబ్లం జరిగితే దానికి ఏ అధికారి బాధ్యత వహిస్తారు ప్రజలు ఎక్కువగాతిరిగే దగ్గర ఇలాంటి గ్యాస్ ఫిల్లింగ్ చేయవచ్చా ఏ అధికారులు దీని మీద కఠినంగా వ్యవహరిస్తారు వేచి చూడాలి ఒక దగ్గర తప్పు జరుగుతుందని తెలిస్తే ఆ తప్పు జరిగే ప్రదేశానికి వెళ్ళినప్పుడు మళ్లీ ఆ తప్పు జరగకుండా కఠినమైన చర్యలు తీసుకొని రావాలి అలాకాకుండా చెప్పి రావటం ఎంతవరకు న్యాయం ఒకసారి ఆలోచించండి మళ్లీ ఆ తప్పు చేయాలంటే వణుకు పుట్టాలి అలాకాకుండా చెప్పి రావటం ఎంతవరకు కరెక్ట్ మనకెందుకులే పైనున్న అధికారులు చూసుకుంటాలే అనే ఒక ధీమా సూళ్లూరుపేట లో ఏ క్షణం ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితుల్లో సూళ్లూరు పేట ప్రజలు ఉన్నారు ప్రజలకు ఏ హాని జరగకముందే పరిమిషన్ లేని గ్యాస్ ఫిల్లింగ్ షాపులు పైన తగిన చర్య తీసుకోవాలని ఈ షాపులకి పర్మిషన్ ఎవరు ఇచ్చారు ఎవరు అండదండలతో నడుస్తున్నాయో ప్రభుత్వ ఉద్యోగులే దీనికి సమాధానం చెప్పాలి అని సూళ్లూరుపేట ప్రజలు ప్రభుత్వ అధికారులను కోరుకుంటున్నారు

Scroll to Top