PS Telugu News
Epaper

భీంగల్ పట్టణములో బి ఆర్ ఎస్ పార్టీ భారీ మెజార్టీతో గెలిపించండి

📅 06 Feb 2026 ⏱️ 5:38 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు నిజాంబాద్ జిల్లా స్టాపర్ టీకే గంగాధర్

బాల్కొండ నియోజకవర్గం లో భీంగల్ పట్టణములో మంజూరైన 10 కోట్ల పనులను రెండేళ్లుగా ఎందుకు నిలిపివేశారు? మహిళలకు నెలకు రూ. 2500 ఏవి? తులం బంగారం ఏది? – మోసపూరిత హామీలిచ్చిన కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి బీఆర్ఎస్ గెలుపు కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిక కావాలి – కారు గుర్తుకు ఓటేసి బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించండి రేవంత్ సర్కార్‌ను నిలదీసిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి భీమ్‌గల్: భీమ్‌గల్ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా 4,8,2 వార్డ్ లలో నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లో బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. “నేను మంత్రిగా ఉన్నప్పుడు, 2023 ఆగస్టులో భీమ్‌గల్ అభివృద్ధి కోసం 10 కోట్ల రూపాయలు మంజూరు చేశాను. అక్టోబర్ 2023లో కలెక్టర్ ద్వారా వర్క్ ఆర్డర్స్ కూడా వచ్చాయి. ముఖ్యంగా వార్డు నెంబర్లు 4, 5, 6, 9, 12లో సీసీ రోడ్లు, డ్రైనేజీల కోసం 2 కోట్ల రూపాయలు కేటాయించాము. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక, ఆ మంజూరైన పనులను కక్షపూరితంగా రెండేళ్లుగా ఆపివేసింది. పనులు మొదలుపెట్టకుండా ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. నిజామాబాద్, ఆర్మూర్ వెళ్ళకుండా భీమ్‌గల్‌లోనే వైద్యం అందాలని 40 కోట్లతో 100 పడకల ఆసుపత్రిని మంజూరు చేసి 80 శాతం పనులు పూర్తి చేశాం. రెండేళ్లుగా మిగిలిన పనులు చేయకుండా ఆసుపత్రిని ప్రారంభించడం లేదు. అలాగే 6 కోట్లతో మొదలుపెట్టిన మార్కెట్ పనులను మరియు భీమ్‌గల్ బస్ డిపోను కూడా ప్రభుత్వం గాలికి వదిలేసింది. డిపోలో బస్సులు లేవు, కంట్రోలర్లు లేరు.” ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై వేముల ప్రశాంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. “ఎన్నికలప్పుడు నెలకు రూ. 2500 ఇస్తామని మహిళలను నమ్మించారు. ఇప్పుడు 25 నెలలయ్యింది.. ఒక్క రూపాయి రాలేదు. అంటే ఒక్కో మహిళకు కాంగ్రెస్ ప్రభుత్వం 62,500 రూపాయలు బాకీ పడ్డట్టే కదా? అవ్వాతాతలకు 4000 పింఛన్ ఇస్తామన్నారు, ఇచ్చారా? తులం బంగారం ఇస్తామన్నారు, ఇచ్చారా? రైతు రుణమాఫీ అందరికీ కాలేదు. రైతుబంధు 15 వేలు ఇస్తామని చెప్పి, పాత 10 వేలు కూడా సరిగ్గా ఇవ్వడం లేదు.” మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి నమ్మి ఓట్లు వేస్తె మోసం చేశారని కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలిసేలా ఈ ఎన్నికల్లో తీర్పు ఉండాలి. ఈ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తేనే, రేపు ప్రభుత్వానికి భయం పుట్టి మీకిచ్చిన హామీలను అమలు చేస్తారు. గత కెసిఆర్ ప్రభుత్వంలో నేను చేసిన అభివృద్ధి పనులను చూసి, భీమ్‌గల్ భవిష్యత్తు కోసం కారు గుర్తుపై బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థులు లక్ష్మి భగత్, పద్మ దశరథ్, పర్స నవీన్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నాను.”
ఈ ఎన్నికల్లో బీజేపీ కి ఓటు వేసి ఓటు ను వృధా చేసుకోవద్దని అన్నారు.. తెలంగాణ రాష్ట్రం నుండి కేంద్రానికి అత్యధిక పన్నులు కడుతుంటే కేంద్రం మాత్రం తెలంగాణ రాష్ట్రానికి నిధులు కేటాయించడం లేదు అన్నారు. తెలంగాణ రాష్ట్రం నుండి 8 మంది కాంగ్రెస్, 8 మంది బీజేపీ ఎంపీలు ఉండి రాష్ట్రానికి ఒరిగింది శూన్యం అని అన్నారు.తాను అధికారంలో లేకపోయినా ప్రజల పక్షాన నిలబడతానని, భీమ్‌గల్ అభివృద్ధి కోసం నిరంతరం పోరాడుతానని ప్రశాంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

Scroll to Top