సూళ్లూరుపేటలోప్రజా ప్రజా దర్బార్
పయనించే సూర్యుడు ఫిబ్రవరి 6 (సూళ్లూరుపేట నియోజకవర్గ రిపోర్టర్ దాసు )
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పురపాలక కార్యాలయం ప్రక్కన) నందు తేది: 06.02.2026 శుక్రవారం “ప్రజా దర్బార్” సూళ్లూరుపేట నియోజకవర్గం శాసనసభ్యురాలు శ్రీమతి నెలవల విజయశ్రీ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమమును ఉద్దేశించి సూళ్లూరుపేట నియోజకవర్గం శాసనసభ్యురాలు శ్రీమతి నెలవల విజయశ్రీ మాట్లాడుతూ సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలో 5 కోట్ల 91 లక్షలతో నిధులతో త్రాగునీరు, సిసి రోడ్లు, సిసి డ్రైన్స్, మొదలగు అన్ని పనులకు శ్రీకారం చుట్టి పనులు మొదలు పెట్టామని, మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలకు ఎటువంటి సమస్యలు ఉన్న తమ వద్దకు అర్జీ రూపంలో తీసుకువచ్చి సమస్య పరిష్కరించుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దాదాపు 70 అర్జీలు స్వీకరించడం జరిగినది అన్ని ప్రతి అర్జీనీ పరిశీలించి నిర్దేశించిన సమయంలో సమస్యను పరిష్కారం చేయడం జరుగుతున్నది అని సూళ్లూరుపేట మున్సిపల్ కమిషనర్ కె.చిన్నెయ్య తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తిరుమూరు సుధాకర్ రెడ్డి, చిట్టేట్టి పెరుమాళ్, వార్డు కౌన్సిలర్లు, కూటమి నాయకులు, మున్సిపల్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది మరియు మెప్మ సిబ్బంది పాల్గొన్నారు.
