బైంసా పట్టణంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరఫున ఇంటింటి ప్రచారం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ సంస్థ కార్పోరేషన్ చైర్మన్ డాక్టర్ రియాజ్ మరియు ముధోల్ మాజీ శాసనసభ్యులు శ్రీ జి. విఠల్ రెడ్డి
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి
బైంసా పట్టణంలోని పలు వార్డులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరుపున ప్రచారం నిర్వహిoచి కాంగ్రెస్ పార్టీ అమలుపరుస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది ఇక్కడ కూడా అధికార పార్టీకి ఓటు వేసి గెలిపించుకోవాలని కోరారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ఇక్కడ జరగలేదని ఈ సమస్యను మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి వివరించడం జరిగింది అని అన్నారు. తొందరలోనే బైంసా పట్టణానికి పెద్ద ఎత్తున ఇందిరమ్మ ఇళ్ళను మంజూరు చేపిస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అంటే నీ పేదోడు ప్రభుత్వమని పేద ప్రజలకు ఎప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాటి నుండి ఎన్నో రోజుల నుంచి ఉన్న నూతన రేషన్ కార్డులను మంజూరు చేసింది అని అలాగే 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు కూడా అందిస్తుందని అన్నారు. అధికార పార్టీకి ఓటు వేసిగెలిపించి బైంసా పట్టణాన్ని ఇంకా మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్దాం అని అన్నారు.
