PS Telugu News
Epaper

సమరసత సేవా ఫౌండేషన్, ధర్మనిధి కరపత్ర ఆవిష్కరణ

📅 06 Feb 2026 ⏱️ 6:22 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పైనించే సూర్యుడు ఫిబ్రవరి 6 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ

ముమ్మిడివరం మండలం సిహెచ్ గున్నేపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీశ్రీశ్రీ సత్తెమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో సమరసత సేవా ఫౌండేషన్ ధర్మనిధి కరపత్ర ఆవిష్కరణ ప్రముఖ వ్యాపారవేత్త టీ నాగేంద్రరావు(నాగు) ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆధ్యాత్మిక సేవకులు గొలకోటి వెంకటరెడ్డి మాట్లాడుతూ గత పది సంవత్సరముల నుండి రాష్ట్రవ్యాప్తంగా హిందూ ధర్మ ప్రచారంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ మన ఆచార సాంప్రదాయాలను ప్రచారం చేస్తూ.. అన్య మత ప్రచారాన్ని అడ్డుకుంటూ.. మతమార్పిడి ప్రమాదాలను వివరిస్తూ స్వధర్మ ఆచరణ శ్రేయస్కరమని చెబుతున్నాదని అన్నారు. ఆలయాల నిర్మాణం చేసి, చిన్నతనము నుండి పిల్లలకు చదువు సంస్కారం ఆటపాట అనే కార్యక్రమంతో బాల వికాస్ కేంద్రాలను నిర్వహిస్తూ గ్రామాలలో అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తూ10 సంవత్సరములు పూర్తి చేసుకొని 11 వ సంవత్సరంలోకి ఈ సంస్థ అడుగుపెట్టడం జరిగిందన్నారు. జిల్లా మహిళా సహ కన్వీనర్ నల్లా ఆండాలదేవి మాట్లాడుతూ సంవత్సరమునకు ఒకసారి ధర్మనిధి తీసుకోవడం జరుగుతుంది అన్నారు ఆధ్యాత్మిక సేవకులు గ్రంధి నానాజీ జిల్లా ధర్మ ప్రచారక్ కె ధర్మారావు ఐ పోలవరం మండల కన్వీనర్ గాదిరాజు విశ్వనాథరాజు కాట్రేనికోన మండల కన్వీనర్ మట్ట సూరిబాబు ధర్మ ప్రచారక్ బొంతు కనకారావు గోవ్వాల అర్జునరావు సుంకర శ్రీను గుబ్బల సూర్య సత్యనారాయణ పరమట పద్మ పరమట భాను తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top