PS Telugu News
Epaper

రక్తదాన కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు -ఎమ్మెల్యే దాట్ల

📅 06 Feb 2026 ⏱️ 6:46 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పైనించే సూర్యుడు ఫిబ్రవరి 6, ( ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ)

నా పుట్టిన రోజు పురస్కరించుకొని నిర్వహిం చిన రక్తదాన శిబిరంలో పాల్గొని కార్యక్ర మాన్ని విజయవంతం చేసిన విద్యార్థులకు, కూటమి నాయకులకు, మహిళా కార్యకర్త లకు, అభిమానులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు అని ప్రభుత్వ విప్, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మి డివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు అన్నారు. మీరు చూపించిన సేవాభావం, సమాజం పట్ల ఉన్న బాధ్యతా భావం నిజంగా అభినందనీయం అని రక్తదానం చేసి ప్రాణాలను కాపాడే మహత్తర కార్యక్రమంలో భాగస్వాములు కావడం ద్వారా మీరు మానవత్వానికి గొప్ప సందేశం ఇచ్చారు. మీ అందరి సహకారం వల్లే ఈ కార్యక్రమం విజయవంతమైంద అని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారి అందరికీ కృతజ్ఞతలు తెలిపారు

Scroll to Top