PS Telugu News
Epaper

ఎస్ ఎస్ ఎఫ్ ధర్మనిధి పుస్తక ఆవిష్కరణ.

📅 07 Feb 2026 ⏱️ 1:54 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయ నించే సూర్యుడు ఫిబ్రవరి 7 ముమ్మిడివరం ప్రతినిధి

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐ పోలవరం మండలం మురమళ్ళ గ్రామంలో శనివారం ముమ్మిడివరం శాసనసభ్యులు శ్రీ దాట్ల సుబ్బరాజు (బుచ్చిబాబు) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం జిల్లా అధ్యక్షులు శ్రీ గుత్తుల సాయి ముమ్మిడివరం మార్కెట్ యార్డ్ ఉపాధ్యక్షులు గోలకోటి వెంకటరెడ్డి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బిజెపి ట్రెజరర్ మరియు ప్రముఖ ఆధ్యాత్మిక సేవకులు గ్రంధి సూర్యనారాయణ గుప్త ( నానాజీ) లు సమరసత సేవా ఫౌండేషన్ వారి ధర్మ నిధి కరపత్ర మరియు పుస్తక ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ధర్మ ప్రచారక్ బొంతు కనకారావు సమస్థ ద్వారా ఎస్సీ ఎస్టీ మత్స్యకార గ్రామాలలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆర్థిక సహకారంతో రాష్ట్రంలో ఎనిమిది వందల దేవాలయాలను నిర్మించి ఆ దేవాలయ కేంద్రముగా ఆ కులస్తులకి అర్చక శిక్షణ ఇచ్చి ఆ దేవాలయంలో పూజారిగా నియమించడం జరిగిందన్నారు ఆ దేవాలయ కేంద్రముగా చదువు సంస్కారం ఆటపాట మన ఆచార సాంప్రదాయాలు నేర్పించుటకు సాయంకాలం బాలవికాస్ కేంద్రాలను నిర్వహించడం గ్రామాలలో అన్యమత ప్రసారాన్ని అడ్డుకుంటూ మతమార్పిడి ప్రమాదాలను తెలియజేస్తూ అనేక మందిని మతం మారకుండా అడ్డుకోవడం గ్రామాలలో అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ విపత్తు సమయాలలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.

Scroll to Top