PS Telugu News
Epaper

సూళ్లూరుపేట శ్రీ చెంగాళమ్మ తల్లి ని దర్శించుకున్న ప్రముఖ హీరోయిన్

📅 07 Feb 2026 ⏱️ 6:53 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు ఫిబ్రవరి 7 (సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ దాసు )

తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలో వెలిసి ఉన్న శ్రీ చెంగాలమ్మ తల్లి తల్లిని ప్రముఖ హీరోయిన్ హెబ్బా పటేల్ దర్శించుకున్నారు అమ్మవారి చరిత్ర తెలుసుకొని అమ్మవారిని ఎలాగైనా దర్శించుకోవాలని అమ్మవారి మొక్కులు చెల్లించుకొని ఆశీర్వాదం పొందాలని తపనతో చెన్నై ఎయిర్ పోర్టుకు వెళుతూ మార్గమధ్యంలో సూళ్లూరుపేటకు చేరుకొని శ్రీ చెంగాళమ్మ అమ్మవారి ఆలయానికి శనివారం ప్రముఖ సినీ హీరోయిన్ హెబ్బా పటేల్ దర్శనం చేసుకున్నారు. తిరుపతిలో ప్రారంభమైన VLCC సలూన్ ఓపెనింగ్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చిన ఆమె, అదే సందర్భంగా సూళ్లూరుపేటకు వచ్చి ఇష్టదైవమైన చెంగాళమ్మ అమ్మవారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు.ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అమ్మవారి ఆశీస్సులు పొందిన హెబ్బా పటేల్, ఆలయ ప్రాంగణంలో అభిమానులతో స్నేహపూర్వకంగా ముచ్చటిస్తూ ఫొటోలకు పోజులిచ్చారు. ఆమె ఆకస్మిక దర్శనంతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి.

Scroll to Top