రాష్ట్రస్థాయి కరాటే లో సత్తా చాటిన మ్యాగ్నెట్ స్కూల్ విద్యార్థులు
అభినందించిన పాఠశాల కరస్పాండెంట్ వాజిద్ పాషా కరాటే మాస్టర్ నరేందర్ నాయక్
( పయనించే సూర్యుడు ఫిబ్రవరి 09 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)
షాద్నగర్ పట్టణంలోని వీ కన్వెన్షన్ హాల్లో జరిగిన రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో పట్టణంలోని మ్యాగ్నెట్ స్కూల్ విద్యార్థులు పాల్గొని ఉత్తమ ప్రతిభను కనబరిచారు. యాదవ్ బుడోఖాన్ కరాటే క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ఛాంపియన్షిప్లో గెలుపొందిన విద్యార్థులు జస్వికా రాథోడ్, శాన్విక రాథోడ్, అన్విక, శ్రీజ, దివిష, ధాత్రి, పూజిత, సాయి తేజ,రిజ్వాన్, సాత్విక్, శివాజీ, అఖిల్, తదితరులు గెలుపొందారు. గెలుపొందిన విద్యార్థులకు మాగ్నెట్ స్కూల్ కరస్పాండెంట్ ఎండి వాజిద్ పాషా, కరికులం డైరెక్టర్ వినోద్ కుమార్, స్కూల్ ప్రిన్సిపాల్ ఆనంద్ మరియు వైస్ ప్రిన్సిపాల్ ఆసిఫ్ విద్యార్థులను అభినందించారు.
