PS Telugu News
Epaper

గ్రామకంఠం భూమి అక్రమ స్వాధీనం పై ఫిర్యాదు

📅 09 Feb 2026 ⏱️ 7:09 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

సమగ్ర విచారణకు డిమాండ్

పయ నించే సూర్యుడు ఫిబ్రవరి 10 ముమ్మిడివరం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా,

పి.గన్నవరం నియోజకవర్గం, అయినవిల్లి మండలం, కే.జగన్నాధపురం గ్రామంలో గ్రామకంఠం భూమిని అక్రమంగా స్వాధీనం చేసుకున్న ఘటనపై జిల్లా కలెక్టరేట్‌లో ప్రజా సమస్యలు – ప్రజావేదిక కార్యక్రమంలో గ్రామ నాయకులు ఫిర్యాదు చేశారు.గ్రామకంఠం భూమిని వంశపారంపర్య భూమిగా చూపిస్తూ, మేడిశెట్టి శ్రీనిబాబు అనే వ్యక్తి రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై అక్రమంగా స్వాధీనం చేసుకుని రేకులతో పెద్ద షెడ్డును నిర్మించారని వారు ఆరోపించారు. ఇది పూర్తిగా ప్రజా వ్యతిరేక చర్యగా అభివర్ణించారు.ఈ విషయంపై ఇప్పటికే 2025 నవంబర్ నెలలో కలెక్టరేట్‌లో గ్రీవెన్స్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ, ఫిర్యాదు పెండింగ్‌లో ఉండగానే అక్రమంగా రిజిస్ట్రేషన్ ఎలా జరిగిందని ప్రశ్నించారు. దీనికి బాధ్యులైన రెవెన్యూ అధికారులపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ఆక్రమించుకున్న గ్రామకంఠం భూమిని, అక్కడ నిర్మించిన రేకుల షెడ్డును తక్షణమే సీజ్ చేయాలని కోరారు.ఈ అంశంపై నేడు మళ్లీ ప్రజా సమస్యలు – ప్రజావేదిక కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి కే. మాధవిని మాజీ ప్రజా ప్రతినిధులు కలిసి సమస్యను వివరించారు. డిఆర్ఓ కే. మాధవి ఈ ఫిర్యాదును పూర్తిగా ఆలకించి, దీనిపై తక్షణమే సంబంధిత అధికారులతో సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్లు ఫిర్యాదుదారులు తెలిపారు.గ్రామ ప్రజలకు చెందిన గ్రామకంఠం భూములపై జరుగుతున్న అక్రమ ఆక్రమణలను అరికట్టి, ప్రజా ఆస్తులను కాపాడాలని గ్రామ నాయకులు కోరారు.

Scroll to Top