PS Telugu News
Epaper

బూర్గుల గ్రామాన్ని అభివృద్ధి చేస్తా సర్పంచ్ రాజ్ గోపాల్ రెడ్డి

📅 11 Feb 2026 ⏱️ 7:09 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

అండర్ డ్రైనేజ్ పనులను ప్రారంభించిన బూర్గుల సర్పంచ్ రాజ్ గోపాల్ రెడ్డి

( పయనించే సూర్యుడు ఫిబ్రవరి 11 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)

ఫరూక్ నగర్ మండలం బూర్గుల గ్రామంలో అండర్ డ్రైనేజ్ పనులను గ్రామ సర్పంచ్ చిలుక మర్రి రాజగోపాల్ రెడ్డి ప్రారంభించారు. గ్రామంలోని పదో వార్డు వార్డులో ఈ డ్రైనేజీ పనులను శంకుస్థాపన చేయడం జరిగింది. గ్రామంలోని డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరచడానికి ఈ పనులను చేపట్టినట్టు సర్పంచ్ రాజగోపాల్ రెడ్డి మీడియాకు తెలిపారు. బూర్గుల గ్రామాన్ని మరింత అభివృద్ధి చేయడానికి తమ వంతు కృషి చేస్తానని సర్పంచ్ అన్నారు . ఈ కార్యక్రమంలో బూర్గుల ఉపసర్పంచ్ చిన్నయ్య గారి శివ లీల, వార్డు సభ్యులు కవిత, సత్యనారాయణ, స్వప్న, తేజశ్రీ రామ్, పవన్ కుమార్, సంతోష్ కుమార్ గౌడ్, హరీశ్వర్, శేఖర్, జంగమ్మ, మాజీ సర్పంచ్ పరశురాం, మాజీ వార్డ్ సభ్యులు ఎల్లయ్య, కిష్టయ్య, జంగయ్య, తిరుపతి, రాజేందర్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top