కేంద్ర ప్రభుత్వ కార్మిక ప్రజావ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలి. సిపిఎం జిల్లా కార్యదర్శి డిమాండ్
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్
నిజాంబాద్ జిల్లా భీమ్గల్ మండల కేంద్రంలో దేశవ్యాప్తంగా కార్మిక సంఘాల సమ్మెలో భీమ్గల్ పట్టణంలో అంగన్వాడీ ఉద్యోగులు, మున్సిపల్ కార్మికులు భారీ ర్యాలీ ధర్నా నిర్వహించటం జరిగింది. ముందుగా సిపిఎం జిల్లా కార్యదర్శి, అంగన్వాడీ యూనియన్ జిల్లా ఏ. రమేష్ బాబు మాట్లాడుతూ కేంద్ర బిజెపి ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని, విద్యుత్ సవరణ చట్టం మరియు ఉపాధి హామీ చట్ట సవరణను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాలు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునివ్వడం జరిగిందని ఆయన అన్నారు. బిజెపి ప్రభుత్వం కార్మిక సంఘాలు, కార్మిక చట్టాలు లేని దేశంగా మార్చాలని కార్మికులకు పెట్టుబడిదారుల వద్ద వెట్టి చాకిరి చేయించాలని సిద్ధపడి, ఎంతోమంది అనేక పోరాటాలు ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను మార్చి నాలుగు లేబర్ కోడ్లను తీసుకువచ్చిందని ఆయన విమర్శించారు. అదేవిధంగా గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దుచేసి వి బి జి రాంజీ స్కీమును తెచ్చి రాష్ట్ర ప్రభుత్వాలపై భారం మోపుతూ నిర్ణయించటం మూలంగా గ్రామీణ పేదలు మరింత పేదరికంలోకి నెట్టబడతారని ఇది వికసిత్ భారత్కు ఎట్లా దారితీస్తుందని ఆయన అన్నారు అదేవిధంగా విద్యుత్ సవరణ బిల్లును, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను తదితర వినాశకరా చట్టాలను తీసుకొచ్చి శ్రమజీవులపై దాడి చేస్తుందని ఆయన అన్నారు వీటి మూలంగా అసంఘటిత మరియు కుటుంబాలు నష్టపోతారని ఆయన అన్నారు. కార్మికులకు కనీస వేతనాలు ఎంత ఉండాలో, ఎన్ని గంటల పని ఉండాలో, జపాలు పెట్టుబడిదారులే నిర్ణయిస్తారని పద్ధతుల్లో కార్మిక చట్టాలను సవరించటం ఈ ప్రభుత్వం ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తుందో అర్థమవుతుందని అన్నారు అంగన్వాడి ఉద్యోగులను కార్మికులుగా గుర్తించకుండా కనీస వేతనాలు అమలు జరపటం లేదని ఆయన విమర్శించారు. ప్రభుత్వం ఇప్పటికైనా కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని, ఉపాధి హామీ చట్ట సవరణను ఉపసంహరించుకోవాలని లేనియెడల పెద్ద ఎత్తున ఆందోళనలు పోరాటాలు మీకు సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తారని హెచ్చరించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికులతో ధర్నా నిర్వహించటం జరిగింది. ఈ కార్యక్రమంలో అంగన్వాడి జిల్లా అధ్యక్షులు, కే దేవగంగు, ప్రాజెక్టు నాయకులు జ్యోతి, ప్రమీల, చంద్రకళ, భాగ్య, వసంత పాటు తదితరులతోపాటు మున్సిపల్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు.
