PS Telugu News
Epaper

ప్రాథమికఆరోగ్యకేంద్రంనుఆకస్మికంగా తనికి చేసిన జిల్లా వైద్య్యాధికారి డాక్టర్ తుకారాం రాథోడ్

📅 13 Feb 2026 ⏱️ 12:20 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

*పయనించె సూర్యుడు ఫిబ్రవరి 12(పొనకంటి ఉపేందర్ రావు )

టేకులపల్లి మండలంలోని సులానగర్ ప్రాథమికఆరోగ్య కేంద్రాన్ని జిల్లావైద్య్యాధికారిడాక్టర్తుకారాంరాథోడ్ సందర్శించారు ఈ సందర్భంగా రోగులకు అందుతున్న సేవలను స్వయంగా రోగులను అడిగి తెలుసుకున్నారు ఆస్పత్రిలోని మందుల నిలువ వివరాలు, రోగులకు అందిస్తున్న రక్త పరీక్షల వివరాలు ప్రసవాల సంఖ్య, హై రిస్క్ గర్భిణీల వివరాలు వారికి అందుతున్న సేవలు జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలు తీరుపై సమీక్షించి లక్ష్యసాధనలో సిబ్బంది నిర్లక్ష్యం వహించవద్దని ఆదేశించారు అనంతరం టేకులపల్లి లోని ఆరోగ్య ఉప కేంద్రాన్ని సందర్శించి రికార్డులను పరిశీలించి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని రోగులతో ప్రేమ పూర్వకంగా ఉండాలని ఆదేశించారు అనంతరం టేకులపల్లి లోని కస్తూరాబా గాంధీ బాలికల పాఠశాలని సందర్శించి హాస్టల్ లో పిల్లలకి అందుతున్న వైద్య సేవలని అడిగి తెలుకున్నారు వంటశాలని స్టోర్ రూమ్ తనిఖీ చేసి తగిన సూచనలు చేశారు అనంతరం బాలికలతో ఏర్పాటు చేసిన సమావేశం లో పిల్లలతో మమేకం అయ్యి హాస్టల్లో చదివే పిల్లలకు చక్కగా ఆరోగ్యంగా ఎదిగేందుకు ప్రభుత్వం అందిస్తున్న చక్కటి పోషకాహారాన్ని వృధా చేయవద్దని శరీరాన్ని పరిశుభ్రం చేసే పీచు పదార్థం అధికంగా లభించే కూరలు పండ్లు తృణధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలని శాకాహారంలో అధికంగా లభించే మంచి ప్రోటీన్ పదార్థాలైన చిక్కుడు బఠానీలు పల్లీలు ఇతర పప్పు ధాన్యాలు ప్రతిరోజు తీసుకోవాలని అలాగే ఎటువంటి పోషకాలు లభించని మైదా అధిక షుగర్ మరియు రకరకాల కలర్స్ తో తయారు చేసే జంక్ ఫుడ్ ఆహార పదార్థాలైన నూడిల్స్, పానీ పూరి, చిప్స్, కూల్ డ్రింక్స్ కేకులు, ఐస్ క్రీమ్స్ తీసుకోవద్దని అపరిశుభ్రమైన వాతావరణం లో అమ్మే ఎటువంటి ఆహార పదార్థాలు తాగు నీటిని తీసుకోవద్దని ప్రతి ఆరు నెలలకు ఒకసారి నులిపురుగుల నివారణకు ఆల్బెండజోల్ టాబ్లెట్లు ప్రతి విద్యార్థి తప్పనిసరిగా మింగాలని, ఆహారం తీసుకునే ముందు మరుగుదొడ్డి ఉపయోగించిన తర్వాత ప్రతిసారి పరిశుభ్రంగా చేతులు కడుక్కోవాలని ప్రతి విద్యార్థి చక్కటి పోషకాహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన అలవాట్ల ద్వారా మంచి రోగ నిరోధక శక్తిని కలిగి ఉండి చదువుల్లో ఆటల్లో అత్యుత్తమమైన ఫలితాలను సాధించొచ్చని విద్యార్థులకు సూచించారు అనంతరం విద్యార్థులతో లెప్రసీ వ్యాధిపై అవగాహన కల్పించి ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు డాక్టర్ కందుల దినేష్ డాక్టర్ కంచర్ల వెంకటేష్, డిప్యూటీ పారామెడికల్ ఆఫీసర్ మోహన్, ఆరోగ్య విస్తరణ అధికారి దేవా, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ సంతు, ఉపాధ్యాయ సిబ్బంది వైద్య సిబ్బంది ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Scroll to Top