రాష్ట్రంలో మెడికల్ మాఫియాని అరికట్టే నాధుడు ఎవరు
పయనించే సూర్యుడు ఫిబ్రవరి 14 (సూళ్లూరుపేట నియోజకవర్గ రిపోర్టర్ దాసు )
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలో రాష్ట్రంలో పేరుకు పోతున్న మెడికల్ మాఫియాను అరికట్టాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఏఐటియుసి ఆధ్వర్యంలో సూళ్లూరు పేట ప్రభుత్వ ఆసుపత్రి సిహెచ్సి వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఏఐటియుసి నియోజకవర్గ కార్యదర్శి నాగేంద్రబాబు సిపిఐ మండల కార్యదర్శి రమణయ్య పట్టణ కార్యదర్శి ఆనంద్ బాబులు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి అసమర్థ పాల నా వలన వైద్య ఆరోగ్యశాఖ పూర్తిగా నాశనం అయిపోతుందని కూటమి ప్రభుత్వం ప్రభుత్వ మెడికల్ ఆస్తులను ప్రైవేటుపరం చేయడానికి పూనుకుంటున్నది ఈ చర్యలను ఏమాత్రం సహించబోమని అదే సందర్భంలో నకిలీ మందులు విచ్చలవిడిగా తయారవుతున్నాయని ఒకటి అర స్పెల్లింగ్ మార్చి ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటున్న ఈ నకిలీ మందుల కంపెనీలపై చర్యలు శూన్యమని, షాపులపై డ్రగ్ ఇన్స్పెక్టర్ల పర్యవేక్షణ ఉండదు మందులు షాపు వారు ఏది పడితే అది తీసుకొచ్చి ఉన్న కంపెనీని ప్రజలకు అంట కడతారు డ్రక్ ఇన్స్పెక్టర్ వారు ఎప్పుడైనా ఒకసారి ముందుల షాపుల్ని తనిఖీలు చేయరు తనిఖీలు చేస్తే కదా. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న ఈ నకిలీ మందుల అరికట్టాలని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి చర్యలను చూస్తూ ఊరుకోమని మెడికల్ మాఫియా పై నకిలీ మందుల దందాలపై భారత కమ్యూనిస్టు పార్టీ ఆందోళనలు ఉదృతం చేస్తామని అవసరమైన నేపథ్యంలో ప్రత్యక్ష దాడులకు సైతం వెనకాడబోమన హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి బాలు ఏఐటీయూసీ నాయకులు శ్రీనివాసులు అశోక్ శ్రీహరి చెల్లయ్య కోటయ్య ఖాసిం తదితరులు పాల్గొన్నారు
