ఉమ్రాకు వెళ్తున్న మిత్రుడికి ఘన సన్మానం
యాడికి సిపిఐ మండల కార్యదర్శి జూటూరు మహమ్మద్ రఫీ
పయనించే సూర్యుడు న్యూస్ ఫిబ్రవరి 14 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి
మండల కేంద్రంలోని నారాయణస్వామి కాలనీలో నివాసముంటున్న గాలి మిషన్ ఖజాముద్దీన్ ఉమ్రాకు వెళుతున్నడంతో తమ ప్రియతమ మిత్రుడిని శనివారం సిపిఐ మండల కార్యదర్శి జూటూరు మహమ్మద్ రఫీ, సిపిఐ అభిమాని జూటూరు అబ్దుల్ రజాక్ జూటూరు బ్రదర్స్ వారి మిత్ర బృందం జమాత్ తో కలిసి తమ మిత్రుడు ఖాజా మోదిన్ ను పూల హారాలు శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జూటూరు మహమ్మద్ రఫీ, అబ్దుల్ రజాక్ మాట్లాడుతూ ప్రతి ముస్లిం తన జీవితంలో ఒక్కసారైనా మక్కా కి వెళ్లి రావాలని దేవుని ప్రార్థిస్తున్నారు. తన మిత్రుడు మక్కాను దర్శించుకుని క్షేమంగా తిరిగి రావాలని ఆకాంక్షించారు. అనంతరం విందు లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మత గురువులు ఉమర్ అలీ జూటూరు బ్రదర్స్ హనీఫ్, అమీర్ భాష మహబూబ్ రబ్బాని, సర్దార్, సోహెబ్, హల్దీ హాజీవలి ,సీఎం భాష, డి భాష, మాజీ కో ఆప్షన్ ఆప్షన్ సభ్యులు నూర్ భాషా, దస్తగిరి, గౌతమ్, వేములపాడు ఖాజా పాల్గొన్నారు
