బీజేపీలోనే మహిళా నాయకత్వానికి అత్యున్నత గౌరవం
పయనించే సూర్యుడు ఫిబ్రవరి 17 ముమ్మిడివరం ప్రతినిధి నానాజీ
భారతీయ జనతా పార్టీరాజకీయాల్లో ఆదర్శంగా బీజేపీ మహిళా మోర్చారాష్ట్ర బడ్జెట్‌పై ప్రశంసలు – బడ్జెట్‌తో రాష్ట్ర భవిష్యత్‌కు బలమైన పునాదిలిబీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్: బీజేపీలో మహిళా నాయకత్వానికి లభిస్తున్న గౌరవం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ పేర్కొన్నారు. రాజకీయాల్లో ఆదర్శంగా నిలుస్తున్న బీజేపీ మహిళా మోర్చా సేవాభావం, కార్యనిర్వహణ నైపుణ్యం, నాయకత్వ స్ఫూర్తితో ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతూ కొత్త రాజకీయ దిశను నిర్దేశిస్తోందన్నారు. మహిళా నాయకత్వానికి అత్యున్నత గౌరవం ఇస్తున్న ఏకైక పార్టీ బీజేపీనే అని ఆయన ఉద్ఘాటించారు. భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో, రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి నిషేధా రాజు అధ్యక్షతన మహిళా మోర్చా రాష్ట్ర పదాధికారుల తొలి సమావేశం ఆదివారం విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ మాట్లాడుతూ, నూతన మహిళా మోర్చా కమిటీని అభినందిస్తూ, ఈ కమిటీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలకాలని ఆకాంక్షించారు.వేదికపై బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు సన్నారెడ్డి దయాకర్ రెడ్డి, సాలిగ్రామ లక్ష్మీ ప్రసన్న, అధికార ప్రతినిధి ముళ్లపూడి రేణుక, రాష్ట్ర ఉపాధ్యక్షులు నిర్మలా కిషోర్, రాష్ట్ర కార్యదర్శులు బొడ్డు నాగలక్ష్మి, రోహిణి తదితరులు పాల్గొన్నారు.మహిళలతో రాజకీయాల్లో కొత్త ఊపిరి: మహిళలే రాజకీయ పార్టీలకువెన్నెముకగా మారుతున్నారని, మహిళా మోర్చా ఒక ఆదర్శ వేదికగా నిలవాలని పీవీఎన్ మాధవ్ అన్నారు. డాక్టర్లు, ఎంట్రప్రెన్యూర్లు, ఉపాధి కల్పించే సామర్థ్యం ఉన్న మహిళలు కమిటీలో ఉండటం పార్టీకి బలమన్నారు.రాష్ట్ర బడ్జెట్‌పై ప్రశంసలు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన 2026–27 బడ్జెట్‌పై ఆయన ప్రశంసలు కురిపించారు. రూ.3.32 లక్షలకోట్లతో రూపొందిన బడ్జెట్ అభివృద్ధి, సంక్షేమానికి దిశానిర్దేశం చేస్తుందని పేర్కొన్నారు. గత 20 నెలల్లో రూ.14 లక్షల కోట్ల పెట్టుబడులు రావడం రాష్ట్రానికి చారిత్రకమన్నారు.మహిళా నాయకత్వానికి గౌరవం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తొమ్మిదోసారి బడ్జెట్ ప్రవేశపెట్టడం మహిళలకు గర్వకారణమని, అలాగే ప్రధాని నరేంద్ర మోదీ మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకురావడం చారిత్రకమని కొనియాడారు.కుటుంబ వ్యవస్థే దేశ బలం భారతదేశ అసలైన బలం కుటుంబ వ్యవస్థేనని, పాశ్చాత్య దేశాల్లా కాకుండా మన సమాజంలో కుటుంబమే సామాజిక భద్రతనిస్తోందన్నారు.మహిళా మోర్చా పరిధి విస్తరించాలి మహిళా మోర్చా కేవలం సాంప్రదాయ కార్యక్రమాలకు పరిమితం కాకుండా, క్రీడలు, సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ రాజకీయాల్లో చురుకుగా పాల్గొనాలని సూచించారు. రాబోయే రోజుల్లో మహిళలు స్వయంగా టిక్కెట్లు కోరే స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు.
