PS Telugu News
Epaper

ఘనంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు..

📅 17 Feb 2026 ⏱️ 1:12 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

.రుద్రూర్, ఫిబ్రవరి 17 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి తుక్కి మహేందర్)

రుద్రూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, బాన్సువాడ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ జన్మదిన వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి ఒకరినొకరు తినిపించుకుంటూ కేసీఆర్, బాజిరెడ్డి గోవర్ధన్ లకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్బంగా బీఆర్ఎస్ పార్టీ రుద్రూర్ మండల ఇంచార్జ్ గాండ్ల మధు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం వచ్చాక డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, మిషన్ భగీరథ, ఆసరా పెన్షన్ వంటి తదితర అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టి అందజేసిన ఘనత కేసీఆర్ దే అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు దౌర్ సాయిలు, శేఖర్, ప్రవీణ్ కుమార్, బొట్టే గజేందర్, కన్నె ప్రవీణ్, నరేందర్, కరొళ్ల వెంకటేష్, వినీత్ పటేల్, జువ్వల శ్రావణ్, క్లిక్ రవి, శేఖర్ (ల్యాబ్), పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top