PS Telugu News
Epaper

వెంకమ్మగూడలో భ్రమరాంబిక మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవం

📅 18 Feb 2026 ⏱️ 7:01 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పాల్గొన్న ఎమ్మెల్సీ నాగరకుంట నవీన్ రెడ్డి

( పయనించే సూర్యుడు ఫిబ్రవరి 18 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)

నందిగామ మండల పరిధిలోని వెంకమ్మగూడ గ్రామంలో మహాశివరాత్రి సందర్భంగా నాలుగవ రోజు భ్రమరాంబిక మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు.ఈ వేడుకలకు ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.ఆలయ పూజారులు వీరేశం, శివానందం కర్ణాకర్ మల్లికార్జున్ వేదమంత్రోచ్చారణల మధ్య స్వామివారికి అనంతరం కళ్యాణ మహోత్సవం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి గ్రామ ప్రజల సంక్షేమం,శాంతి సౌభాగ్యాలు కలగాలని ప్రార్థించారు. మహాశివరాత్రి వేడుకలు గ్రామంలో భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయని తెలిపారు.కార్యక్రమంలో వెంకమ్మగూడ సర్పంచ్ గొర్లపల్లి అశోక్,వీర్లపల్లి సర్పంచ్ చిందం పాండు,మామిడి పల్లి సర్పంచ్ హన్మంత్ రెడ్డి, మొదల్లగూడ సర్పంచ్ పెండ్యాల అరుణ రాజు,బీఆర్ఎస్ నాయకులు జంగిలి కుమార్,శ్రీశైలం,వార్డు మెంబెర్స్ గుండాల శ్రీనివాస్ ఎర్రమోళ్ల జగన్ గుండాల రవి,మరియు గొరిగే వెంకటేష్, భగవాన్ రాజు,చేగు శ్రవణ్, కుమ్మరి సురేష్, భరత్ గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Scroll to Top