PS Telugu News
Epaper

కెనరా బ్యాంకు ప్రధానమంత్రి సురక్ష భీమా యోజన పథకం

📅 18 Feb 2026 ⏱️ 7:04 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు ఫిబ్రవరి 18 (సూళ్లూరు పేట నియోజకవర్గ0 రిపోర్టర్ దాసు)

తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండలం పరమేశ్వరి నగర్ లో మల్లి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది.ఇతని గురించి బ్యాంక్ లో విచారించగా ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన(పిఎంఎస్ బివై)పథకం యాక్టివ్ లో ఉంది. దీనికిగాను మేము బ్యాంకు లో క్లెయిమ్ చేశాము.పిఎంఎస్ బివై ద్వారా రూ.2 లక్షలు రూపాయలు అమౌంట్ సెటిల్మెంట్ అయ్యింది. పిఎంఎస్ బివై ద్వారా రూ.2 లక్షలు రూపాయలు అతని భార్య మల్లి వాణి కి అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా కెనరా బ్యాంకు రీజినల్ ఆఫీసు సంజీవ్ కుమార్ మాట్లాడుతూ ప్రధానమంత్రి జీవనజ్యోతి భీమా యోజన మరియు ప్రధానమంత్రి సురక్ష భీమా యోజన వంటి బీమా పథకాలు ప్రతి ఒక్కరూ చేసుకోవాలని భవిష్యత్తులో జరిగే అకాల సంఘటనలకు మీ కుటుంబాలకి చేయూత కలిగే విధంగా భరోసా కల్పిస్తుంది అని తెలియ చేయడం జరిగింది.పై కార్యక్రమంలో కెనరా బ్యాంక్ రీజినల్ ఆఫీసు ఏజిఎం సంజీవ్ కుమార్,సూళ్లూరుపేట బ్రాంచ్ చీఫ్ మేనేజర్ టి. కరుణానిధి,బ్యాంక్ మేనేజర్ శివ ప్రసాద్,ఫీల్డ్ ఆఫీసర్ ప్రియాంక,బ్యాంక్ సిబ్బందిలు మరియు మల్లి శ్రీనివాసులు Ex.BC కార్పొరేషన్ డైరెక్టర్ తిరుపతి డిస్ట్రిక్ట్ మరియు సూళ్లూరుపేట ఆర్థిక అక్షరాస్యత కేంద్రం కౌన్సిలర్స్ ముని చంద్ర, పరమానందం పాల్గొనడం జగిరింది.

Scroll to Top