PS Telugu News
Epaper

బూర్గుల లో అంగడి (సంత )నిర్వహణకు శ్రీకారం

📅 18 Feb 2026 ⏱️ 7:10 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

మార్చ్ 5. 2026 గురువారం నుంచి ప్రారంభం

ప్రతి గురువారం బూర్గుల గ్రామ అంగడి

ప్రారంభించనున్న సర్పంచ్ రాజగోపాల్ రెడ్డి

( పయనించే సూర్యుడు ఫిబ్రవరి 18 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)

రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండల పరిధిలోని బూర్గుల గ్రామంలో మార్చ్ 5 గురువారం నాడు బూరుగుల సర్పంచ్ చిలుకమర్రి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో అంగడి (సంత) ను ఘనంగా ప్రారంభించనున్నారు. మార్చి నుంచి ఏర్పాటు చేసే అంగడి బూరుగుళ్ల చుట్టుప్రక్కల ఉన్న తాండలు మరియు గ్రామాల ప్రజలు పాల్గొని ఈ అంగడి ను విజయవంతం చేయాలని మరియు బూర్గుల గ్రామపంచాయతీ అభివృద్ధికి సహకారం అందించాలని సర్పంచ్ రాజగోపాల్ రెడ్డి మీడియా ద్వారా తెలిపారు. అంగడికి కావలసిన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ప్రజలకు ఏ అవసరం ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని సర్పంచ్ రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో బూర్గుల పంచాయతీ కార్యదర్శి వాసవ చారి, సర్పంచ్ రాజగోపాల్ రెడ్డి మరియు ఉప సర్పంచ్ శివలీల మరియు వార్డ్ సభ్యులు కవిత, సత్యనారాయణ, పవన్ కుమార్, సంతోష్ కుమార్ గౌడ్, హరిస్వర్, శేఖర్, జంగయ్య, రాము తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top