డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో వ్యక్తికి 10 వేలు జరిమానా..
ఆరు నెలల పాటు లైసెన్స్ రద్దు…
రుద్రూర్, ఫిబ్రవరి 19 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి తుక్కి మహేందర్)
రుద్రూర్ మండల పరిధిలో వాహనాలు తనిఖీలు నిర్వహిస్తుండగా, మద్యం సేవించి కారు నడుపుతున్న వ్యక్తి గుమ్మల దేవేందర్, తండ్రి భూమన్న చీమరాజు పల్లి గ్రామం, నందిపేట్ మండల వాసికి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేసినట్లు ఎస్సై సాయన్న వెల్లడించారు. మేజిస్ట్రేట్ ముందర ప్రొడ్యూస్ చేయగా, మేజిస్ట్రేట్ శేషతల్ప సాయి 10 వేల రూపాయలు జరిమానా విధించి, ఆరు నెలల పాటు అతని లైసెన్స్ ను సస్పెన్స్ చేసినట్లు తెలిపారు.