PS Telugu News
Epaper

ఘనంగా “చత్రపతి శివాజీ మహారాజ్ 396 వ జయంతి”.

📅 19 Feb 2026 ⏱️ 4:21 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయ నించే సూర్యుడు ఫిబ్రవరి 19 ముమ్మిడివరం ప్రతినిధి

చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు చెయ్యరు పంచాయితీ ప్రాంగణంలో, పంచాయతీ సర్పంచ్ చెల్లి సురేష్ మరియు మట్ట సూరిబాబు ఆధ్వర్యంలో ఘనంగా దేశభక్తి ఉత్సాహంతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిధులుగా కాట్రేని కోన సబ్ ఇన్స్పెక్టర్ ఐ అవినాష్ మరియు బిజెపి జిల్లా ట్రెజరర్ గ్రంధి నానాజీ విచ్చేసినారు. అధ్యక్షులు మట్టా శివకుమార్, సుంకర నాగేశ్వరావు, నంద్యాల చంటి మరియు సీనియర్ నాయకులు, పార్టీ కార్యకర్తలు, మరియు యువత పెద్ద సంఖ్యలో పాల్గొని మహానుభావుడైన మరాఠా వీరుడు, దేశనిర్మాత ఛత్రపతి శివాజీ మహారాజ్‌కు ఘన నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో శివాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం ద్వారా ప్రారంభమైంది. అనంతరం అతిథులుగా కాట్రేనికోన సబ్ ఇన్స్పెక్టర్ ఐ అవినాష్ ప్రసంగిస్తూ శివాజీ మహారాజ్ జీవితం, వీరత్వం, పరిపాలనా నైపుణ్యం మరియు ఆయన స్థాపించిన స్వరాజ్య సిద్ధాంతాల గొప్పతనాన్ని వివరించారు. ధర్మరక్షణ, మహిళల గౌరవ పరిరక్షణ, ధైర్యం, స్వాభిమానం మరియు మంచి పాలనకు శివాజీ మహారాజ్ చిరస్మరణీయ ప్రతీకగా నిలిచారని పేర్కొన్నారు. మరొక అతిథిగా వచ్చిన బిజెపి జిల్లా ట్రెజరర్ గ్రంధి నానాజీ ప్రసంగిస్తూ యువత శివాజీ మహారాజ్ చూపిన మార్గంలో నడుచుకొని దేశ నిర్మాణంలో క్రమశిక్షణతో, అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.

Scroll to Top