PS Telugu News
Epaper

హిందుత్వ రక్షకుడు వీర శివాజీ 396వ జయంతి.

📅 19 Feb 2026 ⏱️ 5:48 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయ నించే సూర్యుడు ఫిబ్రవరి 19 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ

ముమ్మిడివరం మండల అధ్యక్షులు సన్నిధిరాజు వీరభద్రశర్మ రూరల్ అధ్యక్షురాలు శ్రీమతి చప్పిడి శ్రీదుర్గ మరియు కాట్రేనికోన ఆధ్వర్యంలో హిందూ ధర్మ రక్షకుడు అధ్యక్షులు మట్ట శివకుమార్ ల ఆధ్వర్యంలో హిందూ ధర్మ రక్షకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ 396వ జయంతి వేడుక నిర్వహించడం జరిగింది ముఖ్యఅతిథిగా విచ్చేసిన అమలాపురం పార్లమెంట్ బీజేపీ కన్వీనర్ ఇళ్ల సత్యనారాయణ మాట్లాడుతూ మొగలలు ఈ దేశాన్ని ఆక్రమించుకుని ధర్మాన్ని దేవాలయాలను నాశనం చేస్తూ ఇక్కడ హిందువులను హింసిస్తూ ఎన్నో ఆకృత్యాలు చేస్తున్న అప్ఘల్ ఖాన్ పై యుద్ధం చేసి రాజ్యాలను జయించి హిందుత్వ రక్షకుడుగా నిలిచిన మహావీరుడు ఈయన భవాని మాత భక్తుడు ఈయన భక్తికి మెచ్చి దుర్గామాత ఖడ్గం అందించిందన్నారు. ముమ్మిడివరం మార్కెట్ యార్డ్ ఉపాధ్యక్షులు గోలకోటి వెంకటరెడ్డి మాట్లాడుతూ చత్రపతి శివాజీ ని స్ఫూర్తిగా తీసుకొని మన దేశాన్ని ధర్మాన్ని ప్రతి ఒక్కరూ రక్షించుకోవడంలో ముందుండాలన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ట్రెజరర్ గ్రంధి నానాజీ ,రాయపురెడ్డి భైరవమూర్తి దాట్ల వెంకట సుబ్బరాజు నాగరాజు రావు బసవ శ్రీహరి పుత్తూరు మూర్తి రాజు కొండేపూడి శ్రీనివాసరావు తట్టవర్తి నాగరాజరావు బసవ శ్రీహరి పొత్తూరి మూర్తిరాజు పట్సమట్ల సత్యనారాయణరాజు మట్ట సూరిబాబు సుంకర నాగేశ్వరరావు నంద్యాల చంటి పట్టమట్ట సాయిఅఖిల్ అల్లూరి సత్యనారాయణరాజు సమరసత సేవా ఫౌండేషన్ ముమ్మిడివరం ఖండ కన్వీనర్ గొలకోటి సాయిబాబు నిట్టల వెంకటలక్ష్మి విత్తనాల రవితేజ కుడిపూడి దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top