PS Telugu News
Epaper

పుష్పయాగంతో పూర్తయిన బట్టి విక్రమార్కేశ్వరుడు కళ్యాణ మహోత్సవాలు…

📅 19 Feb 2026 ⏱️ 6:38 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయ నించే సూర్యుడు ఫిబ్రవరి 19 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ

దక్షిణ భారతదేశంలోనే ఏకైక ఆలయంగా అలలారుతున్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం ఆలమూరులో వేంచేసి యున్న ఆలమూరు శ్రీ భట్టి విక్రమార్క ఆలయంలో స్థానిక బ్రహ్మ బ్రహ్మశ్రీ వెలవెలపల్లి కృష్ణచైతన్య గారి బ్రహ్మత్వం లో ఆలయ అర్చకులు బ్రహ్మశ్రీ పెదపళ్ళ సీతారామశాస్త్రి గారు, మరియు ఆలయ ప్రధానార్చకులు టీటీడీ వార్షిక సత్కార పండితులు బ్రహ్మశ్రీ కాళ్లకూరి సూరిపండు వారి సారధ్యం లో ఈనెల 12వ తేదీన ప్రారంభమై నిన్న బుధవారం రాత్రి ద్వాదశ ప్రదక్షిణాలు & శ్రీ పుష్ప యాగ మహోత్సవంతో స్వామివార్ల కళ్యాణ మహోత్సవాలు వైభవోపేతంగా పూర్తయ్యాయి… ఈ సందర్భంగా దేవస్థాన కార్యనిర్వహణాధికారి వారు నరేంద్ర కుమార్ శ్రీ పుష్పయాగ ఏర్పాట్లను పర్యవేక్షించి భక్తులకు ప్రసాద వితరణ జరిపించిరి. ఈ సందర్భంలో దేవస్థానం వారు కళ్యాణబ్రహ్మకి చిరు సత్కారం జరిపిరి.. ఇదే సందర్భంలో ఆలమూరు గ్రామస్తులు బొబ్బా ఆదినారాయణ వారు దంపతులు ఆలయ ప్రధాన అర్చకులైన బ్రహ్మశ్రీ సూరి పండు వారిని నూతన వస్త్రాలతో, దుస్సాలువ తో సత్కరించిరి.. ఓం నమశ్శివాయ…

Scroll to Top