PS Telugu News
Epaper

వరి మొక్కజొన్న రబీ పంటలపై రైతులకు అవగాహనసదస్సు

📅 20 Feb 2026 ⏱️ 9:17 AM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించె సూర్యుడు ఫిబ్రవరి 19(పొనకంటి ఉపేందర్ రావు )టేకులపల్లి :

ముత్యాలంపాడు రైతు వేదిక లో కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రింత్వ వారి కేంద్రీయ సమగ్ర సస్యరక్షణ కేంద్రం (CIPMC) హైదరాబాద్ ఆధ్వర్యంలో రైతుల కు వరి, మొక్కజొన్న మరియు ఇతర రబీ పంటల లో సమగ్ర సస్య రక్షణ పైన మానవ వనరుల శిక్షణ (HRD) కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో 100 మంది వరకు రైతులు, పురుగుమందుల డీలర్లు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో ముందుగా Central Integrated Pest Management Centre (CIPMC), Hyderabad ఇన్చార్జి శ్రీ వెంకటరెడ్డి, ప్లాంట్ ప్రొటెక్షన్ ఆఫీసర్ మాట్లాడుతూ రైతుల కోసం కేంద్రీయ సమగ్ర సస్య రక్షణ కేంద్రం, హైద్రాబాద్ నుంచి చేపడుతుంది agents, HRD వంటి రెండు మరియు ఐదు రోజుల వివిధ రకాల శిక్షణ కార్యక్రమాల గురించి వివరించారు. ఉదయశంకర్, అసిస్టెంట్ ప్లాంట్ ప్రొటెక్షన్ ఆఫీసర్ మాట్లాడుతూ సమగ్ర సస్య రక్షణ పద్ధతులైన బంతి, ప్రొద్దు తిరుగు లాంటి ఎర పంటలు, తూనీగ, గొల్లభామ, పెంకు పురుగు, తేనెటీగ, సాలె పురుగు, అల్లిక రెక్కల పురుగు లాంటి మిత్ర పురుగులు, ట్రైకోగ్రామ గుడ్డు పరాన్న జీవుల గురించి చెప్పి రైతుల ద్వార మిత్ర పురుగు v/s. శత్రు పురుగుల గ్రూప్ డైనమిక్స్ చేయించారు. హొన్నప్పగౌడ ప్లాంట్ ప్రొటెక్షన్ ఆఫీసర్ విత్తన శుద్ధి ఉపయోగాలు గురించి చెప్పి డెమో చూపించారు. వెంకట రెడ్డి NPSS అనే కేంద్ర ప్రభుత్వ రూపొందించిన మొబైల్ యాప్ సస్య రక్షణలో ఏ విధంగా వాడాలో వివరించారు. వ్యవసాయ శాఖ నుండి బాబూరావు జిల్లా వ్యవసాయ అధికారి పాల్గొని రైతులు తప్పనిసరిగా సమగ్ర సస్య రక్షణ పద్దతులు పాటించాలని పిలుపు ఇచ్చారు. శ్రీమతి అన్నపూర్ణ మండల వ్యవసాయ అధికారి, వ్యవసాయ విస్తరణ అధికారులు శ్రీమతి శ్రావణి రమేష్ పాల్గొని రైతులకు మార్గదర్శనం చేశారు. క్షేత్ర ప్రదర్శన లో భాగంగా వ్యవసాయ క్షేత్రం లో లింగకర్షక బట్టలు పెట్టి వాటి వాడకాన్ని రైతులకు వివరించారు. మొక్కజొన్న పొలం లో మిత్రపురుగులైన రెడువిడ్ పురుగులను, ట్రై కోకార్డ్ లను విడుదల చేశారు.ఈ కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ మంగలి పాల్గొని రైతులకు మార్గదర్శకం చేసారు.ఈ కార్యక్రమం లో రైతులు ఎంతో ‘ ఉత్సాహం గా పాల్గొన్నారు.

Scroll to Top