గద్వాల మున్సిపాలిటీ ఆదర్శవంతమైన మున్సిపాలిటీ గా తీర్చిదిద్దాం
జనం న్యూస్ 20 ఫీబ్రవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
జోగులాంబ గద్వాల మున్సిపల్ చైర్ పర్సన్ పదవి బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
ఈరోజు గద్వాల జిల్లా కేంద్రంలోని గద్వాల మున్సిపాలిటీ నందు గద్వాల మున్సిపాలిటీ నూతనంగా మున్సిపల్ చైర్ పర్సన్ గా తుమ్మల జయలక్ష్మీ నర్సింహులు యాదవ్ నేడు పదవి బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గద్వాల ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హాజరయ్యారు.ఎమ్మెల్యే కి మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్మన్ కౌన్సిలర్స్ శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా స్వాగతం పలికారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సమక్షంలో మున్సిపల్ చైర్ పర్సన్ గా తుమ్మల జయలక్ష్మి నరసింహులు యాదవ్ మొదటి సంతకం చేసి పదవికి బాధ్యతలు స్వీకరించిన జరిగింది.మున్సిపల్ చైర్ పర్సన్ కి బ్రాహ్మణులు, ముస్లిం మత పెద్దలు, చర్చి పాస్టర్లు ఆశీర్వదించడం జరిగినది .నూతనంగా మున్సిపల్ చైర్ పర్సన్ బాధ్యతలు స్వీకరించిన చైర్పర్సన్ కి వైస్ చైర్మన్ కి గద్వాల ఎమ్మెల్యే శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా సత్కరించారు.
ఎమ్మెల్యే మున్సిపల్ చైర్ పర్సన్ ప్రత్యేకమైన నెమలి దండ తో ఘనంగా సత్కరించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ
గద్వాల మున్సిపల్ నూతన చైర్మన్ వైస్ చైర్మన్ కౌన్సిలర్స్ హార్థిక శుభాకాంక్షలు
గద్వాల పట్టణ ప్రజలు మీపై మీకు ఓట్లు వేసి కౌన్సిలర్ గా అవకాశం కల్పించారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వార్డ్ అభివృద్ధికి కృషి చేయాలి ప్రజలకు మీపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా పనిచేయాలని సూచించారు.రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి , జిల్లా మంత్రివర్యులు రాష్ట్ర మంత్రివర్యులు సహకారంతో ప్రత్యేక నిధులు తీసుకొచ్చి గద్వాల మున్సిపాలిటీ భవిష్యత్తులో ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దే విధంగా నా వంతు కృషి చేస్తానని తెలిపారు. భవిష్యత్తులో మున్సిపాలిటీ అభివృద్ధికి నా వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు.
గద్వాల మున్సిపల్ చైర్ పర్సన్ మాట్లాడుతూ. గద్వాల మున్సిపల్ చైర్ పర్సన్ గా నా పై నమ్మకం నుంచి నాకు అవకాశం కల్పించిన ఎమ్మెల్యే కి హృదయపూర్వక ప్రత్యేక ధన్యవాదాలు..గద్వాల పట్టణ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తూ గద్వాల పట్టణంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పారిశుద్ధ్య ,దీపాలు రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి వార్డ్ పై ప్రత్యేక దృష్టి పెట్టి వాడు అభివృద్ధితోపాటు గద్వాల పట్టణ అభివృద్ధికి నా వంతు సహాయశక్తుల కృషి చేస్తానని తెలిపారు.ఎమ్మెల్యే సహకారంతో భవిష్యత్తులో గద్వాల మున్సిపాలిటీ రాష్ట్రంలోని ఆదర్శవంతమైన మున్సిపాలిటీగా తీర్చిదిద్దే విధంగా కృషి చేస్తామని తెలిపారు. ఎమ్మెల్యే కి ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, వైస్ చైర్మన్, కౌన్సిలర్స్, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.