PS Telugu News
Epaper

కుంటాల మండల కేంద్రంలో కల్యాణ లక్ష్మి – షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ… చేసిన ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్

📅 21 Feb 2026 ⏱️ 6:34 PM 📝 HOME
Listen to this article

సుర్యపూర్ మరియు దౌనెల్లీ గ్రామాలకు (బీఎస్ఎన్ఎల్) టవర్ మంజూరు

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో *కుంటాల మండల కేంద్రంలో సంక్షేమం–అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తూన్న ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ * రోజు కుంటాల మండల కేంద్రంలోని రైతు వేదిక నందు ఆయా గ్రామాలకు చెందిన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద 37 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడం తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.మండలంలోని సాంకేతిక సమస్యలపై తక్షణ స్పందన చూపిన ఎమ్మెల్యే, సూర్యాపూర్ మరియు దౌనెల్లి గ్రామాల్లో నెలకొన్న నెట్‌వర్క్ సమస్యలను పరిష్కరించేందుకు (బీఎస్ఎన్ఎల్) టవర్ మంజూరు పత్రాన్ని గ్రామ ప్రజాప్రతినిధులకు అందజేశారు. దీంతో ఆ గ్రామాల ప్రజల చిరకాల సమస్యకు శాశ్వత పరిష్కారం లభించిందని పేర్కొన్నారు.అలాగే మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సమస్యలపై సమగ్రంగా సమీక్షించి వాటి పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపడతామని ఎమ్మెల్యే తెలిపారు.

Scroll to Top