PS Telugu News
Epaper

బాధిత కుటుంబానికి అండగా మోహనరావు పటేల్ ప్రజా ట్రస్ట్

📅 21 Feb 2026 ⏱️ 6:40 PM 📝 తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో : సిరిపెల్లి గ్రామంలో ఇటీవల షార్ట్ సర్క్యూట్తో ఇల్లు దగ్ధమైన విషయము తెలిసిందే. ఇంట్లో నివసిస్తున్న సాయవ్వ కుటుంబానికి కేవలం వేసుకున్న దుస్తులు మిగిలాయి.సంవత్సరానికి సరిపోయే వంట సామాగ్రి మొత్తం కాలిపోయింది.కొంత నగదు,ఇంటి కాగితాలు ఏమి మిగలకుండా మంటల్లో కాలి బుడిదైపోయింది.ఈ విషయాన్ని తెలుసుకున్న మోహన్ రావు పటేల్ * ఈరోజు సిర్పేలి గ్రామానికి వెళ్లి ఆ బాధిత కుటుంబానికి పరామర్శించి *నెల రోజులకు సరిపడే బియ్యము, అదేవిధంగా తన వంతుగా ఆర్థిక సాయం అందించాలన్న ఉద్దేశంతో చెక్కు రూపంలో డబ్బులను అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ సర్పంచ్ ఆరేపల్లి సతీష్,మాజీ సర్పంచ్ రాజేందర్,మాజీ సర్పంచ్ దత్తురాం పటేల్,పల్సి సర్పంచ్ రాములు,గ్రామ యువ నాయకుడు సబ్బిడి రాజు, గణేష్, గ్రామ పెద్దలు యువకులు పాల్గొనడం జరిగింది.మోహన్రావు పటేల్ మాట్లాడుతూ ఐదు జరగరాని సంఘటనలు జరిగినప్పుడు ప్రజా ట్రస్ట్ అందుబాటులో ఉండి కావాల్సిన సదుపాయాలను లేదా ఆర్థికంగా ప్రోత్సహిస్తుందని తెలిపారు. అదేవిధంగా సిరిపెల్లి గ్రామస్తులు జరిగిన సంఘటన తెలుసుకొని గ్రామానికి వచ్చి ఆర్థికంగా ఆదుకున్న మోహన్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముధోల్ మాజీ ఎంపీపీ సుభాష్ పటేల్ పాల్గొనడం జరిగింది.

Scroll to Top