PS Telugu News
Epaper

విక్రమ్ కాలేజ్ పరీక్షా కేంద్రంలో సత్యం విద్యార్థులు

📅 23 Feb 2026 ⏱️ 2:52 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు ఫిబ్రవరి 23 (సూళ్లూరుపేట నియోజకవర్గ0 రిపోర్టర్ దాసు)

తిరుపతి జిల్లా సూళ్లూరు పేట మున్సిపాలిటీ పరిధిలో ఇంటర్మీడియట్ పరీక్షల్లో జంబ్లింగ్ విధానం తీసుకువచ్చారు. ఒక కాలేజ్ సంబంధించిన వారిని వివిధ పరీక్షా కేంద్రాల్లో పరీక్ష రాసే విధంగా ఇంటర్ బోర్డు అధికారులు ఎప్పటినుంచో జంబ్లింగ్ విధానం ప్రవేశపెట్టారు. సూళ్లూరుపేటలో ఇంటర్మీడియట్ పరీక్షల కోసం మూడు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ గురుకుల పాఠశాల, విక్రమ్ కళాశాల పరీక్షా కేంద్రాలకు ఎంపిక చేశారు. అయితే సూళ్లూరుపేటలో అటు విక్రమ్ ఇటు శ్రీ సత్యం ప్రైవేట్ జూనియర్ కళాశాల మధ్య పోటీ తత్వం ఉంది. కళాశాల అడ్మిషన్ల విషయంలో విద్యార్థుల వద్దకు ఇరు కళాశాల యజమానులు, ఉపాధ్యాయ బృందం తమ కళాశాలలో చేరాలంటూ అభ్యర్థించడం జరుగుతూ వస్తుంది. ఈ క్రమంలో అడ్మిషన్ల విషయంలో రెండు కళాశాల మధ్య పోటీ తత్వం ఉండటంతో పరీక్షల్లో ఫలితాలు పై కూడా ఇరుకళాశాల వారు పోటీ పడుతూ ఉంటారు. అయితే సత్యం కాలేజ్ సంబంధిత విద్యార్థులు అందరిని కూడా విక్రమ్ కళాశాల వద్ద ఏర్పాటుచేసిన పరీక్షా కేంద్రంలో పరీక్షలు రాసే విధంగా సెంటర్ వేయడంతో విద్యార్థులతో పాటు తల్లిదండ్రుల్లో ఆందోళన చెందుతున్నారు. ఈ వ్యవహారంపై సత్యం జూనియర్ కళాశాల విద్యార్థులు తల్లిదండ్రులు కలిసి సూళ్లూరుపేట మండల రెవెన్యూ అధికారి గోపీనాథ్ రెడ్డిని కలిశారు. జంబ్లింగ్ జరిగిన అన్యాయాన్ని దృష్టికి తీసుకువెళ్లి సమస్యను తక్షిణమే పరిష్కరించాలని విక్రమ్ కళాశాలలో పరీక్ష కేంద్రాలో ప్రభుత్వ సిబ్బందిని నియమించాలని కోరారు.

Scroll to Top