PS Telugu News
Epaper

లైన్స్ క్లబ్ ఆఫ్ టేకులపల్లి ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు పరీక్ష భయం నివారణపై అవగాహన

📅 23 Feb 2026 ⏱️ 6:43 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

మానసిక ధైర్యం పెంపొందించే కార్యక్రమం

లయన్స్ క్లబ్ అఫ్ ఇంటర్నేషనల్ ప్రాంతీయ అధ్యక్షులు సాతులూరి సత్యనారాయణ

పయనించె సూర్యుడు ఫిబ్రవరి 23(పొనకంటి ఉపేందర్ రావు )

టేకులపల్లి: అంతర్జాతీయ సేవా సంస్థ లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ అనుబంధంగా పనిచేస్తున్న లయన్స్ క్లబ్ ఆఫ్ టేకులపల్లి ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు పరీక్ష భయం నివారణపై అవగాహన మరియు ప్రేరణాత్మక కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మణుగూరు జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ సత్య ప్రకాష్ హాజరై విద్యార్థులకు ప్రేరణాత్మక ఉపన్యాసం అందించారు. పరీక్షలు జీవితంలో ఒక భాగం మాత్రమేనని, భయాన్ని దూరం చేసి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సూచించారు. సమయపాలన, క్రమశిక్షణ, సరైన పునశ్చరణ విధానం మరియు లక్ష్యసాధనపై దృష్టి పెట్టాలని వివరించారు.లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ప్రాంతీయ అధ్యక్షుడు సాతులూరి సత్యనారాయణ విద్యార్థులకుమానసికధైర్యంపెంపొందించుకోవాలని, ఒత్తిడిని సానుకూల ఆలోచనలతో అధిగమించాలని సూచించారు.టేకులపల్లి లయన్స్ క్లబ్ అధ్యక్షుడు కేస వేణుగోపాలరావు అధ్యక్షత వహించగా, కార్యదర్శి తోటకూరి సందీప్ కుమార్ కార్యక్రమ లక్ష్యాన్ని వివరించారు. విద్యార్థుల్లో పరీక్షలపై ఉన్న అనవసర భయాన్ని తొలగించి, ధైర్యంగా ముందుకు సాగేందుకు మార్గనిర్దేశం చేయడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని తెలిపారు.కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు బొడ్డుపల్లి బ్రహ్మచారి మరియు బోడ పుణ్య నాయక్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. కష్టపడి చదివితే విజయం తప్పక సాధ్యమని, ఓర్పు మరియు పట్టుదలతో లక్ష్యాన్ని సాధించాలని విద్యార్థులను ప్రోత్సహించారు. పరీక్షలను ఒక అవకాశంగా భావించి, ధైర్యంగా ఎదుర్కొనాలని సూచించారు.మణుగూరు లయన్స్ క్లబ్ కార్యదర్శి శ్రీనివాసరావు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు ఈ కార్యక్రమాన్ని అభినందించారు.చివరగా పరీక్షలు భయానికి కారణం కావని, అవి విజయానికి ఒక మెట్టు మాత్రమేనని సందేశమిస్తూ కార్యక్రమం ముగిసింది.

Scroll to Top