PS Telugu News
Epaper

పంట నమోదు పకడ్బందీగా నిర్వహించండి – షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

📅 23 Feb 2026 ⏱️ 6:53 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే

( పయనించే సూర్యుడు ఫిబ్రవరి 23 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)

పంట నమోదు,ఫార్మర్ రిజిస్ట్రేషన్ పకడ్బందీగా నిర్వహించాలని షాద్ నగర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్ వీర్లపల్లి శంకర్ ఆదేశించారు.నేడు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ…రాష్ట్ర ప్రభుత్వం,వ్యవసాయ శాఖ ఆదేశానుసారం వ్యవసాయ విస్తరణ అధికారులు వాలంటీర్ ల సహాయంతో గ్రామాల్లోకి వెళ్లి పంటల నమోదు చేయాలని కోరారు. అదేవిధంగా రైతు నమోదు ( ఫార్మర్ రిజిస్ట్రేషన్) వేగవంతం చేయాలని తెలిపారు.ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్ తో రైతులకు ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని కోరారు.అలాగే యూరియా కొరత లేకుండా జాగ్రతలు తీసుకోవాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో షాద్ నగర్ అదనపు సంచాలకులు రమాదేవి, వ్యవసాయ విస్తరణ అధికారులు, మండల వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు

Scroll to Top