PS Telugu News
Epaper

లక్ష్మణ్ రాథోడ్ కి ఇండియన్ బెస్ట్ ఇన్స్పిరేషన్ అవార్డు

📅 24 Feb 2026 ⏱️ 6:25 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు గాంధారి 25/02/26

మారుమూల గిరిజన గ్రామీణ ప్రాంతాల్లో క్రీడల అభివృద్ధికి పాటు పడటం, క్రీడల ద్వారా సర్వోన్నతబివృద్ధి సాధించవచ్చు అని తెలుపుతూ క్రీడల ద్వారా శారీరక సంకల్పమే కాకుండా ఉన్నత స్థాయిలో ఉద్యోగం కూడా సంపాదించవచ్చు అని తెలుపుతూ నిరుపేద కుటుంబల క్రీడాకారులకు చేయూత ఇవ్వడం కోసం క్రీడా ఫౌండేషన్ ఏర్పాటు చేసి అనాధ పిల్లలకు పెద పిల్లలకు రాష్ట్ర జాతీయ స్థాయి వరకు రాణించే విధంగా ఉచిత క్రీడా శిక్షణ తో పాటు క్రీడా సదుపాయాలు కల్పిస్తూ పలువురి మన్ననలు పొందుతున్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెట్ సంగం వ్యాయామ ఉపాధ్యాయుడు, బామన్ నాయక్ స్పోర్ట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు లక్ష్మణ్ రాథోడ్ కు న్యూఢిల్లీకి చెందిన గ్యాన్ ఉదయ్ ఫౌండేషన్ వారు దేశంలో ఉత్తమ క్రీడా ప్రేరణ (ఇండియాన్ ఇన్స్పిరేషన్ అవార్డు ఇచ్చినట్లు ఆయన ఒక ప్రకటన ద్వారా తెలిపారు. దేశ వ్యాప్తంగా వివిధ రంగాల్లో అత్యుత్తమ సేవల అందిస్తున్న వారి సేవలను వాలంటీర్ ద్వారా సర్వే చేయించి ఈ అవార్డు ప్రధానం చేసి నట్లు ఆయన తెలిపారు. గత 17 సంవత్సరాలుగా మారుమూల ప్రాంతాల్లో ఉద్యోగం చేస్తూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విదార్థులను క్రీడల్లో మెళుకువలు నేర్పిస్తూ వస్తున్నా,అని ప్రతి ఏడాది రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ సహకారంతో వేసవి శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు, శ్రేష్ట్ భారత్ సంస్థ వారుకూడా వివరాలు సేకరించినట్లు ఆయన చెప్పారు , దేశ రాష్ట్ర వాలీబాల్ అసోసియేషన్ , బామన్ నాయక్ స్పోర్ట్స్ ఫౌండేషన్ వారి ప్రోద్బలంతో క్రీడల అభివృద్ధి పాటు పడుతున్నట్లు ఆయన వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలు అభివృద్ధికి మరిన్ని శిక్షణ శిబిరాలు చేపట్టాల్సి ఉందని గ్రామీణ క్రీడాకారులు పుట్టుకతో శారీరక దృఢత్వం కలిగి ఉండటం వల్ల అత్యున్నత స్థాయి శిక్షణ ఇస్తే అంతర్జాతీయస్థాయి ఎదగవచ్చు అన్నారు, పేద పిల్లలు సహాయం చేయడం గర్వంగా ఉందని, ఈ అవార్డు రావడం వల్ల ఎంతో సంతోషంగా ఉందని, కరోనా సమయం నుండి ప్రతి అవార్డు పోస్ట్ ద్వారానే అందిస్తున్నారని సంస్థ డైరెక్టరు నగేశ్ ఆయన సూచించనట్లు ఆయన చెప్పారు. లక్ష్మణ్ రాథోడ్ అవార్డు రావడం పట్ల ఫౌండేషన్ చీఫ్ ప్యాట్రాన్ గుగ్లోత్ సురేందర్, ఎస్జీఫ్ సెక్రెటరీ హీరాలాల్ మాజీ జెడ్పీటీసీ శంకర్ నాయక్ తదితరులు ప్రత్యేకంగ అభినందనలు తెలిపారు.

Scroll to Top