అగ్రకులోన్మాదంతో చాకలి కుటుంబం పై దాడి చేసిన రెడ్డిలను వెంటనే కఠినంగా శిక్షించాలి*
కులోన్మాద దాడిలో పసిపాపని కోల్పోయిన కుటుంబానికి కోటి రూ.ఎక్స్గ్రేషియా ఇవ్వాలి
.బహుజనులంతా అగ్రకుల మనువాద రాజకీయాలను తులనాడాలి
– డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యువజన సంఘం మక్తల్
:పయనించే సూర్యుడు: :ఫిబ్రవరి 25మక్తల్
:మక్తల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఈనెల18వ తారీఖున నాగర్ కర్నూల్ జిల్లా,కుమ్మెర గ్రామ మల్లన్న జాతరలో అగ్రకుల రెడ్డిలు కులన్మాదంతో బహుజన చాకలి కుటుంబంపై దాడి చేసి,2 నెలల పసిపాపను చంపేసిన దుర్మార్గ చర్యను తీవ్రంగా నిరసిస్తూ,ప్రాణాలు కోల్పోయిన పసి పాపకు నివాళులర్పించడం జరిగింది.నాయకులు మాట్లాడుతూ గుడిలో దేవుడి దర్శనానికి వెళ్తున్న బహుజన చాకలి కుటుంబాన్ని అడ్డుకొని,మీరు తక్కువ కులం వారనీ 100 రూపాయలు టిక్కెట్ తీసుకోని వెళ్లాలని అవమానించి,ఎదురు తిరిగిన ఆ చాకలి ఆడబిడ్డల కుటుంబంపై బూతులు తిడుతూ అన్యాయంగా,అక్రమంగా దాడి చేసి కనికరం లేకుండా కులం అంటే తెలియనీ రెండు నెలల పసిపాపను చంపేసిన తుకారం రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి మరి కొంతమంది దుర్మార్గులకు పోలీసులు,రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం కాస్తుండటాన్నీ ఖండిస్తున్నామన్నారు.అదే విధంగా రాజ్యాంగానికి విరుద్ధంగా జరిగిన ఈ ఘటనకు బాధ్యులైన రెడ్డిలను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షులు విశారదన్ మహరాజ్,బిఎస్పీ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు, తీన్మార్ మల్లన్న,సోషల్ మీడియా ప్లాట్పామ్ ద్వారా ఎంతోమంది డిమాండ్ చేస్తున్నా పట్టించుకోకపోవడం సిగ్గుచేటని వెంటనే ఆ కులోన్మాద దుర్మార్గులను అంబేద్కర్ యువజన సంఘం మక్తల్ గా కఠినంగా శిక్షించాలని, పసిపాపను కోల్పోయిన ఆ కుటుంబానికి కోటి రూపాయలు ఎక్స్గ్రేషియాను అందించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.అలాగే ఈ ఆధునిక కాలంలో కులాలు ఎక్కడున్నాయనీ, అంటరానితనం ఎక్కడుందని మాట్లాడే కుహనా మేధావులు కళ్ళు తెరవాలన్నారు.అదేవిధంగా ఎప్పుడూ హిందువులము బంధువులమని అని చెప్పే బిజెపి దాని అనుబంధ సంస్థలు మన వర్గాలపై,మన ఆడబిడ్డలపై అగ్రకులోన్మాదులు దాడులు చేసినపుడు వారి నోరు మూగబోతుందని,కాబట్టి వారి అగ్రకుల మనువాద రాజకీయాలను వ్యతిరేకించాలనీ పిలుపునిచ్చామన్నారు.ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పృథ్వీరాజ్,బిఎస్పి జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి చంద్రశేఖర్, KNPS విజయ్ కుమార్,డిటిఎఫ్ పరందాములు, అంబేద్కర్ సంఘం సాంస్కృతిక కార్యదర్శి పరంజ్యోతి, ఆంజనేయులు,ఆర్టిఐ గొల్లపల్లి నారాయణ, బిఆర్ఎస్ నాయకులు బండారి ఆనంద్,పెరియర్ సంఘం అక్షయ్ కుమార్,ధర్మ సమాజ్ పార్టీ తిమ్మప్ప,రమేష్,పుడమి ఫౌండేషన్ రవికుమార్, బేగర్ శ్రీహరి,తల్వార్ నరేష్, సాయి, సందీప్,ప్రశాంత్,జగదీష్, సురేష్,రమేష్ తదితరులు పాల్గొన్నారు.
