PS Telugu News
Epaper

భీంగల్ పట్టణములోఅభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన చైర్ పర్సన్ బోధిరే నాగమణి స్వామి

📅 25 Feb 2026 ⏱️ 7:13 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్

భీంగల్ పట్టణంలోని ఎనిమిదో వార్డులో బుధవారం సీసీ రోడ్డు నిర్మాణ పనులను మున్సిపల్ చైర్ పర్సన్ బోదిరే నాగమణి ( స్వామి) పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ బాల్కొండ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ప్రత్యేక చొరవతో పట్టణంలోటీయూఎఫ్ఐడీసీ పథకం ద్వారా 11 కోట్లు 50 లక్షలు మంజూరైన నిధుల్లో భాగంగా పట్టణంలో వివిధ వార్డులలో సీసీ రోడ్లు మరియు సీసీ డ్రైనేజీల నిర్మాణం కల్వర్టులు, బీటీ రోడ్ల నిర్మాణం చేపట్టడం జరుగుతుందని తెలిపారు. అందులో భాగంగానే ఈరోజు 8వ వార్డులో సీసీ రోడ్ల పనులు ప్రారంభించడం జరిగిందని తెలిపారు పట్టణంలో అన్ని వార్డులలో నిర్మించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ సంటి లత (జేజే నర్సయ్య ) వార్డ్ కౌన్సిలర్ సందీప్. 11వ వార్డ్ కౌన్సిలర్ సంగ్య నాయక్. కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top