PS Telugu News
Epaper

టేకులపల్లి అంగన్‌వాడీ కేంద్రంలో ఘనంగా సామూహిక శ్రీమంతాలు – చిన్నారులకు అక్షరాభ్యాసం

📅 26 Feb 2026 ⏱️ 5:22 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించె సూర్యుడు ఫిబ్రవరి 26(పొనకంటి ఉపేందర్ రావు )

టేకులపల్లి, మండల పరిధిలోని టేకులపల్లి గ్రామ పంచాయతీ అంగన్‌వాడీ కేంద్రం వేదికగా ఈరోజు మాతృత్వానికి గౌరవం,విద్యా వికాసానికి ప్రాధాన్యతనిస్తూ ఒక అద్భుతమైన కార్యక్రమం నిర్వహించారు.గ్రామ సర్పంచ్ బోడ బాలు నాయక్ మరియు సెక్టార్ సూపర్వైజర్ కె. అనురాధ ఆధ్వర్యంలో ఆరుగురు గర్భిణీ స్త్రీలకు వైభవంగా సామూహిక శ్రీమంతాలు నిర్వహించగా,ఐదుగురు చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించి విద్యాబుద్ధులకు శ్రీకారం చుట్టారు.మాతృత్వానికి మంగళ హారతులు:శ్రీమంతాల వేదికపై ఆరుగురు గర్భిణీలకు సాంప్రదాయబద్ధంగా గాజులు తొడిగి,పసుపు కుంకుమలు ఇచ్చి,పౌష్టికాహార కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా సెక్టార్ సూపర్వైజర్ కె.అనురాధమాట్లాడుతూగర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న పథకాలపై అవగాహన కల్పించారు.విద్యకు తొలి అడుగు:పాఠశాల వయస్సు వచ్చిన ఐదుగురు చిన్నారులకు సర్పంచ్ బాలు మరియు హెడ్ మాస్టర్ సమక్షంలో అక్షరాభ్యాసం చేయించారు. చిన్నారుల చేత పలకపై ఓనమాలు దిద్దించి, విద్యా రంగంలో వారు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.పాల్గొన్న ముఖ్యులు:ఈ సామాజిక వేడుకలో జిపి సర్పంచ్ బాలు వార్డ్ మెంబర్ జిజ గ్రామ పంచాయతీ సెక్రెటరీ మరియు స్థానిక పాఠశాల హెడ్ మాస్టర్ పాల్గొన్నారు.వీరితో పాటు అంగన్‌వాడీ టీచర్లు భద్రమ్మ, పద్మ, ఇందిరమ్మ, ఆశా కార్యకర్త మజహరి కార్యక్రమ నిర్వహణలో కీలక పాత్ర పోషించారు. గర్భిణీ స్త్రీల భర్తలు, వారి కుటుంబ సభ్యులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.సర్పంచ్ సందేశం:సర్పంచ్ బాలు మాట్లాడుతూ.. “గ్రామ పంచాయతీ అభివృద్ధి అంటే కేవలం రోడ్లు,డ్రైనేజీలే కాదని,గ్రామంలోని తల్లులు, పిల్లల ఆరోగ్యం మరియు చదువు కూడా అభివృద్ధిలో భాగమేనని” కొనియాడారు.ప్రధానమంత్రి మాతృ వందన యోజన ద్వారా మొదటిసారి గర్భం దాల్చిన మహిళలకు ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం గురించి వివరించారు.అలాగే పోషణ్ అభియాన్ కింద అందిస్తున్న పౌష్టికాహార ప్రాముఖ్యతను మరియురాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న తల్లి మరియు శిశు ఆరోగ్య కిట్(కెసిఆర్ కిట్) ప్రాముఖ్యతను,గర్భిణీలకు అందించే ఆర్థిక భరోసాను వివరించారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న “ఆరోగ్య లక్ష్మి” పథకం కింద గర్భిణీలకు మరియు బాలింతలకు అందించే పౌష్టికాహారం, పాలు,గుడ్లను సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు.శిశు సంక్షేమం:చిన్నారులకు వేయాల్సిన టీకాలు మరియు మిషన్ ఇంద్రధనుస్సు వంటి కార్యక్రమాల ద్వారా బిడ్డ ఆరోగ్యానికి ప్రభుత్వం కల్పిస్తున్న రక్షణ గురించి అవగాహన కల్పించారు.ఇలాంటి కార్యక్రమాలు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా నిర్వహించడం వల్ల పేద ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని ఆయన తెలిపారు.

Scroll to Top