PS Telugu News
Epaper

మనో ప్రగతి క్యాంప్ లో భాగంగా అన్నదానం

📅 26 Feb 2026 ⏱️ 5:26 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

కౌన్సిలర్ అల్కూరి పావని

పయనించే సూర్యుడు: :ఫిబ్రవరి 27మక్తల్:

మక్తల్ పట్టణంలోని స్థానిక ఎంపీడీవో ఆఫీస్ ఆవరణలో ఉన్న దివ్యాంగుల కార్యాలయంలో ప్రతి నెల నిర్వహించే మనో ప్రగతి క్యాంప్ లో పాల్గొన్న వారికి 16వ వార్డ్ కౌన్సిలర్ ఆల్కూరి పావని ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. దివ్యాంగులకు నిర్వహించే క్యాంప్లో ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి వారు ప్రతినెలా వస్తుంటారని, వారికి ఇక మీదట ప్రతినెలా మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఉంటుందని అల్కూరి పావని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల కోసం సీఎం రేవంత్ రెడ్డి మంత్రి వాకిటి శ్రీహరి ఆధ్వర్యంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందని వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ అల్కూరి రవికుమార్, దివ్యాంగుల శాఖ అధికారి కిరణ్, సీసీ అనురాధ, ఆయా వెంకటమ్మ , 16వ వార్డ్ నాయకులు ఆనంపల్లి రమేష్ వల్లంపల్లి గురురాజ్, మధు, ప్రవీణ్ కుమార్, రాకేష్, రాము, సతీష్, రంజాన్ రాజా తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top