PS Telugu News
Epaper

మధిర మండల విద్యాశాఖాధికారి వై. ప్రభాకర్ అవినీతి, ఆక్రమాలు

📅 26 Feb 2026 ⏱️ 6:55 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

దర్యాప్తు – శాఖాపరమైన చర్యలు గైకొనాలని

పయనించే సూర్యుడు ఫిబ్రవరి 27 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్

మధిర మండల విద్యాశాఖాధికారి వై. ప్రభాకర్ 2013వ సంవత్సరం నుండి విధులు నిర్వహిస్తున్నారు. ఈనెల 28-02-2026న పదవీ విరమణ చేయబోతున్నారు.ఈ నేపద్యంలో తన పదవీకాలంలో విద్యాశాఖాధికారిగా పలు అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు పత్రికా విలేకరుల సమావేశంలో ఆర్. లక్ష్మణ రావు, రిటైర్ స్కూల్ అసిస్టెంట్ జెడ్ పి ఎస్ ఎస్ దెందుకూరు అరోపించారు.2014వ సంవత్సరంలో ఎం ఆర్ సి కార్యాలయానికి మెస్సేంజర్ పోస్టు మంజూరు చేయబడినది. ఈ పోస్టులో కాంట్రాక్ట్ పద్దతిన ఏ వ్యక్తినైనా నియమించుకొని జీతము చెల్లించవలసినయున్ ది.కానీ, గుట్టుచప్పుడు కాకుండా సదరు పోస్టులో తన భార్య (చారులత)ను నియమించి నాటి నుండి నేటి వరకు ఒక్కరోజైనా డ్యూటీ చేయకుండానే నెలకు రూ.11,050-00ల చొప్పున గడిచిన 12 సంవత్సరములకు గాను సుమారు రూ.16,56,000లు తన భార్య పేరుతో నెల నెలా బిల్లులు చెల్లించి ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగపరిచినారు. తన పరిధిలోని కొందరు ఉపాధ్యాయులకు సరెండర్ లీవులు, అర్ధ వేతన సెలవులు మరియు కమ్యూటెడ్ సెలవులు మంజూరు చేసి నగదుగా మార్చుకొన్న తదుపరి అట్టి ఎంట్రీలను సర్వీసు రిజిష్టరులో నమోదు చేయకుండా అవినీతికి పాల్పడినారు. ఈ విషయం సంబంధిత సర్వీసు రిజిష్టర్లు, వేతన బిల్లులు, ఉపాధ్యాయుల హాజరు రిజిష్టర్లు పరిశీలిస్తే తేట తెల్లమవుతుంది.తను పనిచేసిన టివిఎం పాఠశాల మరియు సిరిపురం పాఠశాల కాంప్లెక్స్ పరిధిలో మంజూరైన నిధులను దుర్వినియోగపర్చినారు.ఎర్రుపాలెం మండలం, ఎంపీపీఎస్ రాజులదేవరపాడు నుండి మధిర మండలం, ఎంపీపీ ఎస్ బాలికల పాఠశాలకు డిప్యుటేషన్ పై నాగమణి అనే మేడం ను కేటాయించి లంచం తీసుకొనుట జరిగింది.2013 అక్టోబర్ నుండి నేటి వరకు ఉద్యోగ విరమణ పొందిన ఉపాధ్యాయులకు ఏ జి ఆఫీసు వారు మంజూరు చేసిన పి పి ఓ కాపీలోని రిమార్కులను క్లియర్ చేయకుండానే నాన్ డ్రావాల్ సర్టిఫికెట్ ఇచ్చి పెన్షన్ మంజూరు చేసినారు. దీని వలన లక్షల రూపాయలు దుర్వినియోగం అయి. ప్రభుత్వానిక నష్టంవాటిల్లందని వారు ఆరోపించారు.ఇటువంటి ఉపాధ్యాయునిపై చట్టపరమైన చర్యలు తీసుకొని మరలా పునరావతం కాకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి

Scroll to Top