షాద్‌నగర్ లో అత్యాధునిక సంతాన సాఫల్య కేంద్రం అందుబాటులోకి రావడం అభినందనీయం
తాండ్ర విశాల శ్రవణ్ రెడ్డి, మాజీ జడ్పిటిసి కేశంపేట్
శ్రీ శారద ఫెర్టిలిటీ అండ్ ఐవిఫ్ సెంటర్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మాజీ జడ్పిటిసి తాండ్ర విశాల శ్రవణ్ రెడ్డి
( పయనించే సూర్యుడు ఫిబ్రవరి 26 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)
షాద్‌నగర్ పట్టణంలో నూతనంగా ఏర్పాటుచేసిన శ్రీ శారద ఫెర్టిలిటీ అండ్ ఐవిఫ్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి విశాల పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, షాద్‌నగర్ లో అత్యాధునిక వైద్య సదుపాయాలతో ఫెర్టిలిటీ అండ్ ఐవిఫ్ సెంటర్ ఏర్పాటు కావడం సంతాన సాఫల్యం కోసం పెద్ద పట్టణాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగా నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి రావడం ఆనందకరమని పేర్కొన్నారు. ఇటువంటి వైద్య సంస్థలు మరింతగా అభివృద్ధి చెందాలని ఆశిస్తూ నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి యాజమాన్యం పాల్గొన్నారు.
