PS Telugu News
Epaper

రుద్రూర్ స్క్రిప్ట్ :

📅 27 Feb 2026 ⏱️ 2:08 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

రుద్రూర్ లో శాంతి కమిటీ సమావేశం….

రుద్రూర్, ఫిబ్రవరి 27 (పాయనించే సూర్యుడు రుద్రూర్ మండల ప్రతినిధి )

రుద్రూర్ గ్రామంలో గత నాలుగు రోజుల క్రితం ఇరు వర్గాల మధ్య జరిగిన దాడుల సందర్బంగా ప్రజలందరూ ఎలాంటి కుల మత బేదాలు లేకుండా కలిసి మెలిసి ఉండాలనే ఉద్దేశంతో రుద్రూర్ మండల కేంద్రంలోని గాంధీ చౌక్ వద్ద గ్రామ సర్పంచ్ ఇందూరు సునీత చంద్రశేఖర్ ఆధ్వర్యంలో గురువారం శాంతి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా గ్రామ సర్పంచ్ ఇందూరు సునీత చంద్రశేఖర్ తో పాటు గ్రామ ప్రజలు మాట్లాడుతూ.. కుల మత బేధాలు లేకుండా అందరూ కలిసి మెలిసి శాంతి సామరస్యంతో ఉంటే ఎలాంటి ఘర్షణలు జరుగవని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ షేక్ నిస్సార్, వార్డు మెంబర్లు, గ్రామ పెద్దలు, వివిధ పార్టీల నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top