PS Telugu News
Epaper

చండూరులో ముగిసిన వార్డు సభ్యుల శిక్షణ తరగతులు .

📅 27 Feb 2026 ⏱️ 3:28 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

గ్రామాల అభివృద్ధిలో వార్డు సభ్యుల పాత్ర కీలకం.

ముగిసిన వార్డు సభ్యుల శిక్షణ తరగతులు .

వార్డు సభ్యుల శిక్షణ తరగతులు ముగింపు..కార్యక్రమంలో ఎంపీడీఓ బి. యాదగిరి .

పయనించే సూర్యుడు న్యూస్ చండూరు ఫిబ్రవరి 27.

గత ఐదు రోజులుగా చండూరు మండల పరిషత్‌ కార్యాలయంలో కొన‌సాగుతున్న గ్రామ పంచాయతీ వార్డు సభ్యుల శిక్షణ కార్యక్రమం శుక్రవారం ముగిసింది. ఈ సందర్భంగా ఎంపీడీఓ బి. యాదగిరి మాట్లాడుతూ… గ్రామీణాభివృద్ధి, పారదర్శక పరిపాలన, పంచాయతీ రాజ్ వ్యవస్థలో వార్డు సభ్యుల పాత్రపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసిందని తెలిపారు. గ్రామాల అభివృద్ధి కోసం ప్రణాళికలు రూపొందించడం, నిధుల వినియోగం, ప్రజా సమస్యల పరిష్కారం, పారిశుధ్య చర్యలు సంక్షేమ పథకాల అమలు అంశాలపై సభ్యులకు వివరించినట్లు పేర్కొన్నారు. ప్రజలతో సమన్వయం పెంపొందించుకుని పారదర్శకంగా పని చేయాలని సభ్యులకు సూచించారు.ఈ సందర్భంగా జిల్లా ట్రైనింగ్ అధికారులు వార్డు సభ్యులకు స్థానిక సంస్థల పరిపాలన, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాల అమలు విధానాలపై అవగాహన కల్పించారు. గ్రామ అభివృద్ధిలో వార్డు సభ్యుల పాత్రను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు శిక్షణ నిర్వహించడం జరుగుతుందన్నారు. అనతరం వార్డు సభ్యులకు సర్టిఫికెట్లు అందజేశారు.

Scroll to Top