బూర్గుల సంత ప్రారంభోత్సవానికి మున్సిపాలిటీ వైస్ చైర్మన్ అందే మోహన్ కు ఆహ్వానం
( పయనించే సూర్యుడు ఫిబ్రవరి 27 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)
రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం బూర్గుల గ్రామంలో మార్చి నెల ఐదో తేదీ గురువారం నుండి ప్రతివారం గురువారం రోజున అంగడి సంత నిర్వహించనున్నారు. అంగడి ( సంత) ప్రారంభోత్సవానికి షాద్నగర్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ అందే మోహన్ ను ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా సంతకు సంబంధించిన కరపత్రాలను మున్సిపల్ వైస్ చైర్మన్ వందేమోహన్ కు అందించారు. ఈ కార్యక్రమంలో బూరుగుల సర్పంచ్ రాజగోపాల్ రెడ్డి మరియు వార్డ్ సభ్యులు సత్యనారాయణ పవన్ కుమార్ సంతోష్ కుమార్ గౌడ్ హరీశ్వర్ శేఖర్ మాజీ సర్పంచ్ పరశురాం జంగయ్య రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
